Updated : 10 Jun 2020 19:09 IST

కామారెడ్డి రైతుకు ‘కరెంట్‌ బిల్లు’ షాక్‌

కామారెడ్డి: సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో కరెంటు బిల్లు రూ.1000 దాటితే అమ్మో అంత బిల్లు వచ్చిందా..! అని ఆశ్చర్యపోతారు. అలాంటిది రూ.500 బిల్లు రావాల్సిన ఇంటికి ఏకంగా రూ.లక్షల్లో వస్తే ఇంకేమైనా ఉందా. ‘కరెంట్‌ షాక్‌’ కొట్టినట్లే అవుతుంది. తాజాగా కామారెడ్డి జిల్లాలోని ఓ సామాన్య రైతు కుటుంబానికి ఇలాంటి ఘటనే ఎదురైంది.

ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి గ్రామానికి చెందిన గాండ్ల శ్రీనివాస్‌ది వ్యవసాయ కుటుంబం. ఆయన ఇంట్లో 3 విద్యుత్‌ బల్బులు, 2 ఫ్యాన్లు మాత్రమే ఉన్నాయి. వీటికి ప్రతి నెలా రూ.500 వరకు కరెంటు బిల్లు వస్తుంది. ఫిబ్రవరి నెలలో రూ.415 విద్యుత్‌ బిల్లును చెల్లించారు. అయితే, కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో మార్చి, ఏప్రిల్‌, మే నెలల్లో విద్యుత్‌ బిల్లులు తీయలేదు. ఈ మూడు నెలలకు కలిపి తాజాగా విద్యుత్‌ శాఖ ఇచ్చిన బిల్లును చూసి విస్మయానికి గురవడం రైతు వంతు అయింది. 3 నెలలకు కలిపి ఏకంగా రూ.7,29,417 విద్యుత్‌ బిల్లు వచ్చింది. ఇంత భారీ మొత్తంలో వచ్చిన కరెంటు బిల్లు చెల్లించేదెలా అని బాధిత రైతు వాపోతున్నాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని