కాప్స్‌ Vs కొవిడ్‌: హైదరాబాద్‌ పోలీసుల వీడియో

కరోనా మహమ్మారిపై పోరులో పోలీసులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. వైద్యులు సహా ఇతర కరోనా వారియర్స్‌తో కలిసి ఈ  మహమ్మారిపై పోరులో ముందు వరుసలో నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో....

Published : 19 Jun 2020 16:17 IST

హైదరాబాద్‌: కరోనా మహమ్మారిపై పోరులో పోలీసులు అహోరాత్రులు కష్టపడుతున్నారు. వైద్యులు సహా ఇతర కరోనా వారియర్స్‌తో కలిసి ఈ  మహమ్మారిపై పోరులో ముందు వరుసలో నిలుస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో ప్రజలు ఇళ్లలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవడమే కాక.. రాత్రిపూట గస్తీ కాయడం, వలస కూలీల తరలింపు వంటి పలు విషయాల్లో కీలకంగా వ్యవహరిస్తూ వచ్చారు. ఈ నేపథ్యంలో ‘కాప్స్‌ వర్సెస్‌ కొవిడ్‌-19’ పేరుతో హైదరాబాద్‌ పోలీసులు ఓ డాక్యుమెంటరీని రూపొందించారు. దీనికి సంబంధించిన ట్రైలర్‌ వీడియోను శుక్రవారం విడుదల చేశారు. 2 నిమిషాల పాటు సాగే వీడియోలో కొవిడ్‌-19పై పోరులో పోలీసుల విధి నిర్వహణను కళ్లకు కట్టారు. దీనికి హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కరోనా వైరస్‌ను మూడో ప్రపంచ యుద్ధంగా అభివర్ణించిన ఆయన.. వైరస్‌పై కలిసికట్టుగా పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని