పోలీసులకు సజ్జనార్ జాగ్రత్తలు

తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నేతలు, వైద్యులు, అధికారులు, పోలీసులు వైరస్‌ బారిన..

Updated : 27 Jun 2020 04:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలంగాణ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. నేతలు,  అధికారులు, వైద్యులు, పోలీసులు వైరస్‌ బారిన పడుతున్నారు. ఫ్రంట్‌ వారియర్స్‌గా పేర్కొనే పోలీసుల్లో కేసుల పెరుగుదల ఆందోళన రేకెత్తిస్తోంది. అంతకంతకూ వైరస్‌ వ్యాప్తి ఎక్కువవుతుండటంతో పోలీసు శాఖలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారనే విషయంపై సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌లో ‘ఈటీవీ’ ముఖాముఖి నిర్వహించగా ఆయన పలు విషయాలు వెల్లడించారు.

వారిపై ప్రత్యేక శ్రద్ధ!
 ‘పోలీసు శాఖలో ముందు జాగ్రత్తగానే అందరికీ పరీక్షలు నిర్వహిస్తున్నాం. పాజిటివ్‌గా తేలితే అవసరమైన వారిని ఆసుపత్రిలో చేర్పిస్తున్నాం. లక్షణాలు లేనటువంటి వారిని తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ హోం క్వారంటైన్‌లోనే ఉండమని సూచిస్తున్నాం. ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారిపై ప్రత్యేక శ్రద్ధ వహించాం’’ అని పేర్కొన్నారు.

స్టేషన్లలో జాగ్రత్తలపై..
‘పోలీసు స్టేషన్లకు వచ్చే ఫిర్యాదు దారులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నాం. శానిటైజర్లను అందుబాటులో ఉంచాం. ఫోన్‌ ద్వారానే పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నాం. హాట్‌స్పాట్లలో విధులు నిర్వర్తించే పోలీసులకు తగిన జాగ్రత్తలు సూచిస్తున్నాం. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. మాస్కులు వినియోగిస్తూ, భౌతిక దూరం పాటించాలి. మంచి ఆహారం తీసుకోవాలి’ అని సూచించారు.

పూర్తి ఇంటర్వ్యూ ఈ వీడియో చూడండి.. 

 

 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని