AP: రికార్డుస్థాయిలో 37 కరోనా మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు 36 మంది కరోనాతో చనిపోయారు.

Updated : 13 Jul 2020 17:10 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గత 24 గంటల్లో రికార్డు స్థాయిలో కరోనా మరణాలు నమోదయ్యాయి. ఆదివారం ఉదయం 9 నుంచి సోమవారం ఉదయం 9 వరకు 37 మంది కరోనాతో చనిపోయారు. ఇప్పటివరకు ఇదే అత్యధికం. ఈ రోజు తాజాగా 1,935 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,919 రాష్ట్రానికి చెందినవారు కాగా,  ఇతర రాష్ట్రాల వారు 13 మంది ఉన్నారు. ఇతర దేశాల నుంచి వచ్చినవారు ముగ్గురు ఉన్నారు. ఇప్పటివరకు 31,103 మందికి కరోనా సోకింది. అందులో రాష్ట్రానికి చెందినవారు 28,255 మంది. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన 2,416 మంది కరోనా పాజిటివ్‌ రాగా, ఇతర దేశాల నుంచి వచ్చిన 432 మందిలో కరోనా ఉన్నట్లు గుర్తించారు. 

ప్రస్తుతం రాష్ట్రంలో 14,274 యాక్టివ్‌ కేసులున్నాయి. ఇందులో 11,958 మంది వివిధ ఆస్పత్రుల్లోను, 2,316 మంది కొవిడ్‌ సెంటర్లలోనూ వైద్యం పొందుతున్నారు. వీరిలో రాష్ట్రానికి చెందినవారు 13,615 మంది. 550 మంది ఇతర రాష్ట్రాలవారు కాగా, 109 మంది ఇతర దేశాలవారు. ఈ రోజు డిశ్ఛార్జి అయిన 1,030 మందితో కలిపి మొత్తంగా 16,464 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రంలో 365 మంది కొవిడ్‌ సోకి చనిపోయారు. 

జిల్లాల వారీగా వివరాలు ఇలా... 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని