రూ.2 చెల్లించు.. ఛాలెంజ్‌ ఓటేయ్‌

ఛాలెంజ్‌ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్‌ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు.

Updated : 07 May 2024 06:13 IST

ఛాలెంజ్‌ ఓటు.. దీని గురించి ఎన్నికల సమయంలో వింటుంటాం. ఎన్నికల నిర్వహణ నిబంధనలు 1961 చట్టంలోని సెక్షన్‌ 49ఏలో వివరాలు ఉంటాయి. పలు సందర్భాలలో ఒకరి ఓటును మరొకరు వేస్తారు. అనంతరం అసలైన వ్యక్తి పోలింగ్‌ కేంద్రానికి వస్తే ఛాలెంజ్‌ ఓటు తెరపైకి వస్తుంది. ఓటరు పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లే సరికి జాబితాలో పేరు లేకపోతే గుర్తింపుకార్డు, ఆధార్‌కార్డు చూపించి సెక్షన్‌ 49ఏ కింద ఛాలెంజ్‌ ఓటును వినియోగించుకోవచ్చు. పోలింగ్‌ బూత్‌లోకి వచ్చిన వ్యక్తి ఓటరు జాబితాలో ఉన్న పేరుకు సరిపడక అనుమానం కలిగితే ఏజెంట్‌ ప్రిసైడింగ్‌ అధికారికి రూ.2 చెల్లించి సవాలు చేయడానికి అవకాశం ఉంటుంది. వయసు, తండ్రి పేరు, అతడి గుర్తింపు కార్డును పరిగణనలోకి తీసుకుని బంధువులు లేదంటే అతడి ఇంటి దగ్గర్లోని వారి సాక్ష్యంగా, వారితో ప్రమాణం చేయించి విచారణ చేపడతారు. బోగస్‌ అని తేలితే అతడిపై ఫిర్యాదు చేసి పోలీసులకు అప్పగిస్తారు. వాస్తవమని తేలితే అనుమతి ఇచ్చి, సవాలు చేసిన ఏజెంట్‌ ఓడిపోయినట్లు తీర్మానించి అతను చెల్లించిన రూ.2 ను ప్రభుత్వానికి అప్పగిస్తారు. ఒక వేళ ఏజెంట్‌ తన సవాలులో గెలిస్తే రూ.2ను పీఓ తిరిగి ఏజెంట్‌కు ఇచ్చేస్తారు. 

న్యూస్‌టుడే, పెద్దశంకరంపేట

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని