GHMC: ఐదురోజులుగా భారీ వర్షాలు.. శిథిలావస్థలో 483 భవనాలు

నగరంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు.

Published : 22 Jul 2023 16:23 IST

హైదరాబాద్‌: నగరంలో ఐదు రోజులుగా భారీ వర్షాలు కురుస్తుండటంతో అధికారులంతా క్షేత్రస్థాయిలో ఉంటూ సమస్యలు పరిష్కరిస్తున్నారని జీహెచ్‌ఎంసీ మేయర్‌ విజయలక్ష్మి తెలిపారు. గత ఐదు రోజులుగా 900 ఫిర్యాదులు వచ్చాయని,  అన్నింటినీ పరిష్కరించామని పేర్కొన్నారు. నారాయణగూడలో మాత్రమే కొంత నీటి సమస్య ఉందన్నారు.  జీహెచ్‌ఎంసీ పరిధిలో నాలాల పనులు 36 చోట్ల జరిగితే 30 పనులు పూర్తయ్యాయని స్పష్టం చేశారు.  గతేడాది సమస్యలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పుడు లేవన్నారు. నగరంలో సీఆర్‌ఎంపీకి చెందిన 28 బృందాలు క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, 24 గంటల పాటు జీహెచ్‌ఎంసీ కంట్రోల్‌ రూమ్‌ పనిచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో 429 బృందాలు పనిచేస్తాయని తెలిపారు. నగరంలో శిథిలావస్థలో ఉన్న 483 భవనాలు గుర్తించి నోటీసులు ఇచ్చామన్నారు. వీటిలో 92 భవనాలకు మరమ్మతులు చేసుకునే అవకాశం ఇచ్చామని, 19 భవనాలు సీజ్‌ చేసినట్టు చెప్పారు. వీలైనంత వరకు ప్రజలు బయటకు రావొద్దని, అత్యవసరం అయితేనే బయటకు రావాలని సూచించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని