NTR: ఎన్టీఆర్‌ పేరిట రూ.100 వెండి నాణెం.. ముద్రణకు కేంద్రం నిర్ణయం

తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది.

Updated : 15 Feb 2023 17:28 IST

పురందేశ్వరిని కలిసిన మింట్‌ అధికారులు

హైదరాబాద్‌: తెదేపా వ్యవస్థాపకుడు, దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్‌ శత జయంత్యుత్సవాల వేళ కేంద్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. ఎన్టీఆర్‌ బొమ్మతో రూ.100 వెండినాణెం ముద్రణకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌ కుమార్తె, కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి నుంచి మింట్‌ అధికారులు సలహాలు, సూచనలను స్వీకరించారు.

ఎన్టీఆర్‌ పేరిట నాణెం తీసుకురావాలని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ను కోరానని ఈ సందర్భంగా పురందేశ్వరి చెప్పారు. నిర్మలా సీతారామన్‌ వ్యక్తిగతంగా చొరవ తీసుకున్న నేపథ్యంలో మింట్‌ నుంచి ఆమోదం వచ్చిందని.. సంబంధిత అధికారులు 3 ఫొటోలను పరిశీలించారని తెలిపారు. నాణెం రూపకల్పన ప్రొసీజర్‌కు నెలరోజుల సమయం పడుతుందని.. ఆ తర్వాతే విడుదల చేస్తారని ఆమె వివరించారు. తన తండ్రి ఆశీర్వాదం వల్లే ఇది సాధ్యమైందని.. దీన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు పురందేశ్వరి చెప్పారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని