Hyd Airport MetroP: ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు

ఎయిర్‌పోర్టు మెట్రో కోసం భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. రెండు నెలల్లో ఈ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు.

Updated : 27 Mar 2023 18:37 IST

శంషాబాద్ విమానాశ్రయం వరకు మెట్రో రైలు నిర్మాణం కోసం భూ సామర్థ్యపరీక్షలు ప్రారంభించినట్లు హైదరాబాద్‌ మెట్రో ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టు కోసం అలైన్‌మెంట్‌ స్థిరీకరణ, పెన్‌ మార్కింగ్‌ పనులు పూర్తయినట్లు చెప్పారు. ఐకియా కూడలి నుంచి శంషాబాద్‌ వరకు 100 మెట్రో పిల్లర్లు అవసరం అవుతాయన్న ఆయన.. ఈ పిల్లర్ల వద్ద నమూనాలను తీసుకొని భూ సామర్థ్య పరీక్షలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సుమారు 40 అడుగుల లోతు వరకు మెట్రో పిల్లర్‌ కోసం తవ్వకాలు చేస్తున్నామన్నారు. రెండు నెలల్లో భూ సామర్థ్య పరీక్షలు పూర్తి చేయనున్నట్లు చెప్పారు. భూ సామర్థ్య పరీక్షలతో స్తంభాల పునాదులు ఏ మేరకు తవ్వాలనే దానిపై స్పష్టత రావడంతోపాటు, టెండర్‌ ప్రక్రియలో పాల్గొనే బిడ్డర్లకు కూడా ఈ ప్రాజెక్టు నిర్మాణం జరిగే భూమి తీరుపై అవగాహన కలుగుతుందన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు