TS News: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు

తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం మార్గద్శకాలు విడుదల చేసింది. కౌన్సెలింగ్‌

Updated : 24 Dec 2021 17:01 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగుల బదిలీలకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. కొత్త స్థానికత అనుగుణంగా బదిలీలు, పోస్టింగ్‌లపై రాష్ట్ర ప్రభుత్వం మార్గద్శకాలు విడుదల చేసింది. కౌన్సెలింగ్‌ ద్వారా ఉద్యోగుల బదిలీలు, పోస్టింగ్‌ల ప్రక్రియ నిర్వహిస్తారు. కొత్త స్థానికత ఆధారంగా సీనియారిటీ జాబితాను రూపొందిస్తారు. ఉద్యోగుల నుంచి ఐచ్ఛికాలను తీసుకోనున్న ప్రభుత్వం.. కలెక్టర్‌, జిల్లా శాఖాధిపతితో బదిలీలపై ఓ కమిటీని ఏర్పాటు చేసింది. వారం రోజుల్లోగా బదిలీల ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేసింది. బదిలీలు, పోస్టింగ్‌ల తర్వాత విధుల్లో చేరేందుకు మూడు రోజులు గడువు ఇచ్చింది. 

మరోవైపు, జిల్లా స్థాయి పోస్టింగ్‌లకు మార్గదర్శకాలు జారీ అయ్యాయి. జోనల్‌/మల్టీ జోనల్‌ పోస్టులకు ప్రభుత్వం విడిగా మార్గదర్శకాలు ఇవ్వనుంది. పోలీస్‌, ఎక్సైజ్‌, స్టాంపులు, వాణిజ్య పన్నులు, రిజిస్ట్రేషన్‌ శాఖలు అవసరమైతే విడిగా మార్గదర్శకాలు జారీ చేయవచ్చని ప్రభుత్వం పేర్కొంది. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని