Himanshu: హిమాన్షు పెద్ద మనస్సు.. రూ.కోటి ఖర్చుతో పాఠశాల ఆధునికీకరణ

ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు (Himanshu Rao Kalvakuntla) పెద్ద మనస్సును ప్రదర్శించాడు.

Updated : 10 Jul 2023 19:19 IST

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్ మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు (Himanshu Rao Kalvakuntla) పెద్ద మనస్సు చాటుకున్నారు. ఓ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను దత్తత తీసుకుని సుమారు రూ.కోటి వెచ్చించి కార్పొరేట్‌ స్కూల్ తరహాలో తీర్చిదిద్దారు. తాను సీఏఎస్ అధ్యక్షుడిగా తన పాఠశాలలో సేకరించిన నిధులతో ఈ పనులు చేపట్టారు. హిమాన్షు పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 12న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆ పాఠశాలను ప్రారంభించనున్నారు.

హిమాన్షు ఖాజాగూడలోని ఓ ప్రైవేటు కార్పొరేట్‌ పాఠశాలలో చదివే సమయంలో.. ఆ పరిసర ప్రాంత గచ్చిబౌలి కేశవనగర్‌లో ఉన్న ప్రాథమిక పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడుతుండేవారు. పేద విద్యార్థులు చదువుకునే ఈ ప్రభుత్వ పాఠశాలను అభివృద్ధి చేసేందుకు దత్తత తీసుకున్నారు. అనంతరం పాఠశాల అభివృద్ధి కోసం సుమారు రూ.80 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఖర్చు చేసి అత్యాధునికంగా తీర్చిదిద్దారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాములు యాదవ్‌ తెలిపారు. హిమాన్షు సమకూర్చిన నిధులతో విద్యార్థులకు బెంచీలు, మరుగుదొడ్ల నిర్మాణం, డైనింగ్ గది, ఆట స్థలాన్ని ఏర్పాటు చేసినట్లు వివరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని