fallopian tubes: అండవాహికలు మూసుకుపోతే ఏం జరుగుతుందో తెలుసా..?

అమ్మ గర్భంలో పిండం పురుడు పోసుకోవడానికి అండం, వీర్యకణం మాత్రమే సరిపోవు. అవి రెండూ ఫలధీకరణ చెందడానికి స్త్రీ శరీరంలో అన్ని రకాలుగా అనువైన పరిస్థితులుండాలి.

Published : 25 Jun 2022 01:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అమ్మ గర్భంలో పిండం పురుడు పోసుకోవడానికి అండం, వీర్యకణం మాత్రమే సరిపోవు. అవి రెండూ ఫలదీకరణ చెందడానికి స్త్రీ శరీరంలో అన్ని రకాలుగా అనువైన పరిస్థితులుండాలి. అండ వాహికల్లో పిండం ఫలదీకరణ చెంది గర్భాశయం చేరుతుంది. కొంతమంది మహిళల్లో అండ వాహికలు మూసుకుపోతాయి. ఇలా ఉంటే ఫలదీకరణ సాధ్యం కాదు. సాంతానరాహిత్యం సమస్యగా మారుతుంది. ఒకప్పుడు అండవాహికలు మూసుకుపోతే పెద్ద ఆపరేషన్‌ చేయాల్సి వచ్చేది. ఇపుడు ఫ్లోరోస్కోపీ లాంటి ఆధునిక పద్ధతులు అందుబాటులోకి వచ్చిన తర్వాత పెద్ద కోతలు లేకుండానే అండవాహికలను సరిచేయడానికి వీలుందని ఇంటర్వేన్షల్‌ రేడియాలజిస్టు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.

ఎన్నెన్నో కారణాలు

అండవాహికలు మూసుకొని పోవడానికి ఎన్నో కారణాలున్నాయి. ఎక్కువగా డెబ్రిస్‌తోనే వాహికలు మూసుకొని పోతాయి. ఇన్‌ఫెక్షన్లతోనూ సమస్య రావొచ్చు. అల్ట్రాసౌండ్‌తో ఇబ్బందులను తెలుసుకోవడానికి అవకాశం ఉంది. ల్యాప్రోకోపీ ద్వారా కూడా సమస్యను గుర్తించడానికి వీలుంది. కొన్నిసార్లు ఎంఆర్‌ఐ, సీటీతోనూ పరీక్షించాల్సి వస్తుంది. ఇన్‌ఫెక్షన్‌ కాకుండా ఇతరత్రా కారణాలతో అండ వాహికలు మూసుకొనిపోతే తెరవడానికి వీలుంది. ఫ్లోరోస్కోపీతో పరీక్షించడమే కాకుండా బ్లాకులను కూడా తొలగించవచ్చు. ఇది కూడా ఎక్కువ సమయం పట్టదు. 15 నిమిషాల్లో ఈ ప్రక్రియ ముగుస్తుంది.

ఫలితాలు ఇలా:  అండవాహికలను తెరిస్తే, ఐవీఎఫ్‌కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. సాధారణంగానే గర్భం దాల్చడానికి వీలుంటుంది. శారీరకంగా పెద్ద సమస్యలుండవు. పిల్లలు కనని వారికి ఈ చికిత్సా విధానం ఎంతో అనుకూలంగా ఉంటుంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని