Telangana news : ఆ వృద్ధురాలికి పింఛన్‌ ఇవ్వండి : హెచ్‌ఆర్‌సీ ఆదేశం

జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన వృద్ధురాలు నాగిడి అంజమ్మకు పింఛన్‌ ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఆమె గత 13 నెలలుగా పింఛన్‌ కోసం అధికారుల

Published : 30 Jan 2022 01:55 IST

జనగామ : జనగామ జిల్లా లింగాల ఘనపురానికి చెందిన వృద్ధురాలు నాగిడి అంజమ్మకు పింఛన్‌ ఇవ్వాలని హెచ్‌ఆర్‌సీ ఆదేశించింది. ఆమె గత 13 నెలలుగా పింఛన్‌ కోసం అధికారుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది. రికార్డుల్లో అంజమ్మ మరణించినట్లు ఉండటం వల్లే పింఛన్‌ రావట్లేదని అధికారులు తెలిపారు. పింఛన్‌ రాక ఇబ్బందులు పడుతున్న అంజమ్మపై పలు పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. వీటిని సుమోటోగా తీసుకోని విచారణ చేపట్టింది. అంజమ్మకు వెంటనే పింఛన్‌ మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించింది. రికార్డుల్లో తప్పుగా నమోదు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని  కోరుతూ.. మార్చి 23లోపు సమగ్ర నివేదిక ఇవ్వాలని జనగామ జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని