Andhra News: గుడివాడ క్యాసినో వ్యవహారం.. తెదేపా ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ

గుడివాడ క్యాసినో వ్యవహరంలో వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీలపై తెదేపా చేసిన ఫిర్యాదుపై ఐటీ శాఖ స్పందించింది. తమవద్దనున్న సమాచారాన్ని తీసుకురావాలని తెదేపా నేత వర్ల రామయ్యకు నోటీసులు జారీ చేసింది.

Updated : 15 Dec 2022 17:27 IST

అమరావతి: కృష్ణా జిల్లా గుడివాడ క్యాసినో వ్యవహారంపై ఐటీ శాఖ దృష్టి సారించింది. క్యాసినో వ్యవహారంలో తమ వద్దనున్న సమాచారం అందించాల్సిందిగా తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్యకు ఐటీ నోటీసులు జారీ చేసింది. వైకాపా నేతలు కొడాలి నాని, వల్లభనేని వంశీల నేతృత్వంలో గుడివాడలో క్యాసినో నిర్వహించారని గతంలో తెదేపా ఆరోపణలు చేసింది. క్యాసినో అంశమై కొడాలి నాని, వంశీలపై సీబీడీటీ, ఈడీ, డీఆర్ఐ, కేంద్ర ఆర్థిక, హోం మంత్రిత్వ శాఖలకు ఇప్పటికే ఫిర్యాదు చేసింది. తెదేపా చేసిన ఫిర్యాదుపై స్పందించిన ఐటీ శాఖ.. సమాచారం సేకరణలో భాగంగా వర్ల రామయ్యను ఈ నెల 19న ఐటీ అధికారుల ఎదుట హాజరుకావాలని నోటీసులు జారీ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని