Machilipatnam: ఇది చెరువు కాదు.. జగనన్న కాలనీ లేఅవుట్‌

రాజకీయ లబ్ధికోసం జగన్‌ ప్రభుత్వం నివాస యోగ్యం కాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి వారి ఉసురు పోసుకుంటోందని తెలుగుదేశంపార్టీ నాయకులు ఆరోపించారు.

Updated : 26 Jul 2023 20:28 IST

మచిలీపట్నం: రాజకీయ లబ్ధి కోసం జగన్‌ ప్రభుత్వం నివాస యోగ్యం కాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి వారి ఉసురు పోసుకుంటోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద లేఅవుట్‌గా పాలకులు చెబుతున్న కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నం కరగ్రహారం పరిధిలోని 360 ఎకరాల లేఅవుట్‌ రెండు రోజుల వర్షానికే చెరువును తలపిస్తోందన్నారు. తెదేపా కార్పొరేటర్‌లతో కలిసి మున్సిపల్‌ మాజీ ఛైర్మన్‌ బాబా ప్రసాద్‌ లేఅవుట్‌ను పరిశీలించారు. అనంతరం తెదేపా నాయకులు మాట్లాడుతూ.. ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వం పేదల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. నగరంలో నిర్మాణం పూర్తయిన టిడ్కో ఇళ్లను ఇచ్చేందుకు మనసురాని ప్రభుత్వం.. పనికిరాని స్థలాల్లో పట్టాలు ఇచ్చి ఇళ్లు కట్టుకోకుంటే రద్దు చేస్తామనడం దుర్మార్గమన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని