Parenting Tips: మీ పిల్లలకు ఇవి నేర్పిస్తున్నారా!

పిల్లల్ని స్కూల్‌కు పంపిస్తే చాలు సగం పని అయిపోయినట్లే అనుకుంటారు తల్లులు. నిజమే వాళ్లకు అన్నీ సమకూర్చాలంటే కష్టమే మరి. పిల్లలకు అన్ని పనులు తల్లే చేయాలంటే ఎలా? కష్టం కదా! అందుకే వారి పనులు వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించండి. మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. మెల్లగా అలవాటైపోతుంది. అన్ని సిద్ధం చేసిపెట్టినప్పుడే వాళ్లు ఇబ్బందుల పడుతుంటారు!

Published : 29 Sep 2022 01:23 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్లల్ని స్కూల్‌కు పంపిస్తే చాలు సగం పని అయిపోయినట్లే అనుకుంటారు తల్లులు. నిజమే వాళ్లకు అన్నీ సమకూర్చాలంటే కష్టమే మరి. పిల్లలకు అన్ని పనులు తల్లే చేయాలంటే ఎలా? కష్టం కదా! అందుకే వారి పనులు వాళ్లే చేసుకునేలా ప్రోత్సహించండి. మొదట్లో కాస్త కష్టంగా ఉంటుంది. మెల్లగా అలవాటైపోతుంది. అన్ని సిద్ధం చేసిపెట్టినప్పుడే వాళ్లు ఇబ్బందులు పడుతుంటారు! ఇక వాళ్ల పనులు వాళ్లే ఎలా చేసుకుంటారు? అనుకుంటున్నారా! నేర్చుకుంటారు. వాళ్లు నేర్చుకునేలా మొదట్లో మీరూ కష్టపడాల్సి ఉంటుంది. 

బ్రషింగ్‌ చేసేటప్పుడు...
బ్రషింగ్‌ ఇంట్లో అందరూ ఒకే సమయంలో చేయండి. కాస్త ఆడుతూ పాడుతూ పనులు నేర్పించండి. బ్రషింగ్‌ ఎలా చేసుకోవాలో మీరు వాళ్లకు తెలియజేయండి. దీంతో మెల్లగా పిల్లలు వాళ్లంతట వాళ్లు బ్రషింగ్‌ అలవాటు చేసుకుంటారు. 

వాటర్‌ బాటిళ్లలో నీళ్లు...
వాటర్‌ బాటిళ్లలో నీళ్లు పట్టాలని చెప్పండి. వారికి సంబంధించిన వస్తువులన్నింటిని ఒకే దగ్గర పెట్టుకోవాలని చెప్పండి. అలా చేయడం వల్ల ఏం లాభమో తెలియజేయండి. దీంతో వారికి క్రమశిక్షణ అలవడుతుంది.

వాళ్లే తినేలా ప్రోత్సహించండి..
 సమయం లేదనో, పిల్లలు ఆలస్యంగా తింటారనో ఆహారాన్ని తల్లులే తినిపిస్తారు. ఇది అత్యవసర సమయాల్లో ఫరవాలేదు. కానీ వాళ్లు తినడం నేర్చుకోకుండా అడ్డుపడేలా ఉండకూడదు. సాధ్యమైనంత వరకు టిఫిన్‌, భోజనం వాళ్లే తినేలా ప్రోత్సహించాలి. 

సమయపాలన..

పిల్లలు ఒక పనిని నిర్ణీత సమయంలోనే పూర్తి చేసుకునే విధంగా చూడాలి. రోజూ ఒకే సమయానికి నిద్ర లేవడం, పాఠశాల నుంచి వచ్చిన తరవాత ఎంత సేపు ఆడుకోవాలి. హోం వర్క్‌ ఎప్పుడు చేయాలి.. ఇలా అన్ని విషయాల గురించి పిల్లలు ఆలోచించుకునేలా తల్లిదండ్రులు చెప్పాలి.  

వాళ్ల వస్తువులు వారే భద్రపరుచుకునేలా..

పిల్లలు తమ ఆట వస్తువులు, బొమ్మలు, పుస్తకాలు వాళ్లే భద్రపరుచుకోవాలని సూచించండి. దీంతో మీరు లేని సమయంలో కూడా వాళ్లు తమ పనులను సులువుగా చేసుకునేందుకు వీలుంటుంది. హోం వర్క్‌ అయిన తర్వాత పుస్తకాలను బ్యాగ్‌లోనే సర్దుకోవాలని చెప్పండి. ఆడుకునేందుకు తీసుకున్న వస్తువులను ఆట పూర్తయిన తర్వాత అదే స్థానంలో పెట్టాలని చెప్పండి. 

ముఖ్యంగా పిల్లలు తల్లిదండ్రులను అనుకరిస్తారు. అందువల్ల పిల్లల ముందు తల్లిదండ్రులు ప్రతికూల వాతావరణం తలెత్తేలా చేయకూడదు. తల్లిదండ్రులు ఇంట్లో నడుచుకునే తీరు బాగుంటే పిల్లలు కూడా అదే విధంగా ఎదుగుతారు.  

ఇలా పిల్లలకు పనులు నేర్పడం అంత సులువైన పని కాదు కానీ అసాధ్యం కాదు. మొదట్లో తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ పెట్టి పిల్లలకు నేర్పితే తర్వాత వారే సులువుగా నేర్చేసుకుంటారు. ఇలా చేయటం వల్ల పిల్లలు సొంతంగా పనులు నేర్చుకోవడానికి వీలుంటుంది. తల్లిదండ్రులకు కూడా పని భారం తగ్గుతుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని