KVS Exam dates: కేవీల్లో 13,404 పోస్టులు.. పరీక్ష తేదీలొచ్చేశాయ్!

కేంద్రీయ విద్యాలయాల్లో 11వేలకు పైగా టీచింగ్, నాన్‌ టీచింగ్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల  షెడ్యూల్‌(exam schedule) వచ్చేసింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6వరకు ఆయా విభాగాల వారీగా పరీక్షలు నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ నిర్ణయించింది.

Updated : 20 Jan 2023 18:09 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా కేంద్రీయ విద్యాలయాల్లో(Kendriya Vidyalaya) భారీగా టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌ ఇటీవల నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. పలు విభాగాల్లో మొత్తంగా 13,404 ఉద్యోగాల భర్తీకి సంబంధించి పరీక్షల షెడ్యూల్‌(kvs exam date) విడులైంది. పీఆర్‌టీ(PRT), టీజీటీ(TGT), పీజీటీ(PGT), వైస్‌ ప్రిన్సిపల్‌(Vice principal), ప్రిన్సిపల్‌(Principal), మ్యూజిక్‌ టీచర్‌(Music teacher), లైబ్రేరియన్‌(Librarian), ఇతర పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 7 నుంచి మార్చి 6 వరకు కంప్యూటర్‌ బేస్డ్‌ పరీక్ష(CBT) నిర్వహించాలని కేంద్రీయ విద్యాలయ సంఘటన్‌(Kendriya Vidyalaya Sangathan) నిర్ణయించింది.

పోస్టులు.. సీబీటీ పరీక్ష తేదీలివే..

అసిస్టెంట్‌ కమిషనర్‌ పోస్టుల(52)కు కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష ఫిబ్రవరి 7న జరగనుండగా.. ప్రిన్సిపల్‌ (239) పోస్టులకు ఫిబ్రవరి 8; వైస్‌ ప్రిన్సిపల్‌(203) & పీఆర్‌టీ (మ్యూజిక్‌-233) ఫిబ్రవరి 9, టీజీటీ (3,176) పోస్టులకు ఫిబ్రవరి 12 నుంచి 14 వరకు; పీజీటీ (1,409) పోస్టులకు ఫిబ్రవరి 16 నుంచి 20 వరకు; ఫైనాన్స్‌ ఆఫీసర్‌(6), ఏఈ(సివిల్‌-2), హిందీ ట్రాన్స్‌లేటర్‌(11) ఉద్యోగాలకు ఫిబ్రవరి 20న; పీఆర్‌టీ ఉద్యోగాలకు(6,414) ఫిబ్రవరి 21 నుంచి 28 వరకు; జూనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాల(702)కు మార్చి 1 నుంచి 5 వరకు; స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌- 2 (54) ఉద్యోగాలకు మార్చి 5; లైబ్రేరియన్ (355)‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ ఆఫీసర్(156)‌, సీనియర్‌ సెక్రటేరియట్‌ అసిస్టెంట్‌(322) ఉద్యోగాలకు మార్చి 6న పరీక్ష నిర్వహించనున్నట్టు ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించిన  సమాచారం కోసం తమ అధికారిక వెబ్‌సైట్‌ https://kvsangathan.nic.in/ను వీక్షించాలని సూచించింది.

రాత పరీక్ష, డెమో, ఇంటర్వ్యూ తదితర అంశాల్లో ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇప్పటికే అర్హులైన అభ్యర్థులు ఆన్‍లైన్‍లో దరఖాస్తు చేసుకున్నారు. గతేడాది డిసెంబర్ 5న మొదలైన ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని