Corona: కరోనా బూస్టర్‌ డోసు తీసుకోవడంలో తెలంగాణ నంబర్‌ వన్‌: హరీశ్‌రావు

ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో కరోనా కొత్త వేరియంట్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్‌ డోసు తీసుకోవాలని తెలంగాణ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు బూస్టర్‌ డోసు పంపాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరినట్లు తెలిపారు.

Published : 25 Dec 2022 01:38 IST

హైదరాబాద్‌: కరోనా బూస్టర్ డోసు తీసుకోవడంలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం సంతోషమని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌ రావు అన్నారు. దీని వెనక సీఎం కేసీఆర్ ముందు చూపుతో తీసుకున్న చర్యలు, అవగాహన కార్యక్రమాలు, వైద్య సిబ్బంది శ్రమ ఉన్నాయని తెలిపారు. కరోనా నుంచి మనల్ని మనం కాపాడుకోవడంలో బూస్టర్ డోసు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. చైనా సహా పలు దేశాల్లో కొత్త వేరియంట్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో అర్హులైన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోసు తీసుకోవడం అవసరమని హరీష్ రావు పేర్కొన్నారు. రాష్ట్రాలకు బూస్టర్ డోసు పంపిణీ చేయాలని ఇప్పటికే కేంద్రాన్ని కోరామని తెలిపారు. త్వరలో అవసరమైనన్ని డోసులు కేంద్రం పంపిణీ చేస్తుందని ఆశిస్తున్నట్లు హరీశ్‌రావు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని