TS News: నిర్మల్ జిల్లా ధర్మారంలో వైభవంగా కోతి దేవుడి జాతర

నిర్మల్ జిల్లా ధర్మారంలో ఏటా నిర్వహించే కోతి దేవుడి జాతర వైభవంగా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వానరానికి గుడి కట్టిన గ్రామస్థులు..

Published : 21 Dec 2021 13:10 IST

నిర్మల్‌: నిర్మల్ జిల్లా ధర్మారంలో ఏటా నిర్వహించే కోతి దేవుడి జాతర వైభవంగా జరుగుతోంది. నాలుగు దశాబ్దాల క్రితం వానరానికి గుడి కట్టిన గ్రామస్థులు.. అప్పటినుంచి కోతి దేవుడిని కొలుస్తున్నారు. ఏటా డిసెంబర్‌లో పెద్ద జాతర నిర్వహిస్తూ.. సుమారు 30 క్వింటాళ్ల బియ్యంతో అన్నదానం చేస్తున్నారు. జాతరకు నిర్మల్‌వాసులు సహా సమీప జిల్లాల నుంచి అనేక మంది భక్తులు హాజరవుతారు. ఆలయ నిర్మాణం వెనక పెద్ద చరిత్రే ఉందని గ్రామస్థులు చెబుతున్నారు. కోరిన కోర్కెలు తీర్చేవాడిగా కోతిదేవుడిని పూజిస్తున్నారు.

Read latest General News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని