నిమ్స్‌లో కరోనా పరీక్షలకు ‘కోబాస్‌’ యంత్రం

కరోనా నిర్థారణ పరీక్షల కోసం హైదరాబాద్‌ నిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కోబాస్‌ 8800’ యంత్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు.

Published : 25 Sep 2020 13:33 IST

హైదరాబాద్‌: కరోనా నిర్థారణ పరీక్షల కోసం హైదరాబాద్‌ నిమ్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన ‘కోబాస్‌ 8800’ యంత్రాన్ని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో ఉన్నామని, ఇప్పటికే అనేక రకాల పరికరాలను సమకూర్చామన్నారు.

పేదలకు అందుబాటులో ఉన్న ఏకైక సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి నిమ్స్‌ అని వివరించారు. మాలెక్యులర్‌ డయాగ్నోస్టిక్స్‌ ల్యాబ్‌ ద్వారా 3800 నుంచి 4వేల వరకు శాంపిల్స్‌ను పరీక్షించవచ్చని తెలిపారు. ‘కోబాస్‌ 8800’ యంత్రాన్ని తొలిసారిగా కొనుగోలు చేశామని, దీని ద్వారా రోజుకు 4వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేయవచ్చని తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం రోజుకు 20వేల ఆర్టీపీసీఆర్‌ టెస్టులు చేసే సామర్థ్యం ఉందన్నారు. త్వరలోనే కరోనా బాగా తగ్గుతుందని భావిస్తున్నట్టు చెప్పారు. అతి త్వరలో గాంధీలో సాధారణ సేవలను అందించే అవకాశం ఉందన్నారు. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న ఔట్‌ సోర్సింగ్‌, నాలుగోతరగతి ఉద్యోగుల జీతాల పెంపుపై కసరత్తు చేస్తున్నామని ఈటల రాజేందర్‌ తెలిపారు.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని