Tirupati Trains: గుడ్‌ న్యూస్‌.. తిరుపతికి ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్‌ - తిరుపతి (Secunderabad to Tirupati) మధ్య ఈ నెల 14, 15 తేదీల్లో రెండు ప్రత్యేక రైళ్లు  (Special Trains) నడుపుతున్నట్టు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది.

Published : 13 Oct 2022 01:21 IST

సికింద్రాబాద్‌: తిరుమల వెళ్లే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను (Tirupati Trains) నడపాలని నిర్ణయించింది. ఈ నెల 14, 15 తేదీల్లో సికింద్రాబాద్‌ - తిరుపతి (Secunderabad to Tirupati) మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్టు వెల్లడించింది. శుక్రవారం సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 8 గంటలకు బయల్దేరనున్న ప్రత్యేక రైలు (07485) మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు తిరుపతి చేరుకోనుంది.

అలాగే, శనివారం తిరుపతి నుంచి రాత్రి 7.50 గంటలకు బయల్దేరనున్న రైలు (07486) ఆదివారం ఉదయం 9 గంటలకు సికింద్రాబాద్‌ చేరుకోనుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో CH.రాకేశ్‌ ఓ ప్రకటనలో తెలిపారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని