Periods: నెలసరి సమయమా! ఈ జాగ్రత్తలు పాటించండి!

నెలసరి సమయంలో ఎక్కడలేని నీరసం వచ్చేస్తుంటుంది. ఏ పని చేసేందుకు ఓపిక ఉండదు. దీనికి తోడు కోపం చిరాకు కూడా తోడవుతాయి. ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

Published : 25 Oct 2022 08:37 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నెలసరి సమయంలో చాలా నీరసంగా ఉంటుంది. ఏ పని చేసేందుకు ఓపిక ఉండదు. దీనికి తోడు కోపం చిరాకు కూడా తోడవుతాయి. ఈ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోండి!

  • పీరియడ్స్‌ సమయంలో వ్యాయామాలు ఎక్కువగా చేయకపోవటమే మంచిది. ఒకే దగ్గర కూర్చోకుండా కాసేపు అటు ఇటూ నడవండి. 
  • ఈ సమయంలో ఎక్కువగా చిరాకుగా ఉంటుంది. కాబట్టి ఎక్కువ శబ్దం వచ్చేలా కాకుండా శ్రావ్యమైన సంగీతాన్ని వింటూ ధ్యానం చేయండి. దీంతో మనసుకు కాస్త ప్రశాంతత చేకూరుతుంది. 
  • డార్క్‌ చాక్లెట్లు నొప్పి నుంచి ఉపశమనం ఇస్తాయి. 
  • ఈ సమయంలో నొప్పి ఎక్కువగా వస్తే వేడి నీళ్లతో కాపడం పెట్టుకుంటే కాస్త ఉపశమనంగా ఉంటుంది. మార్కెట్‌లో ఎలక్ట్రానిక్‌ హాట్‌ బ్యాగులు కూడా అందుబాటులో ఉన్నాయి. 
  • ఎక్కువగా విశ్రాంతి తీసుకోవాలి! కాఫీ, టీలు తాగకూడదు. ఈ సమయంలో పండ్ల రసాలు తాగితే శరీరానికి శక్తి లభిస్తుంది. 
  • ఈ సమయంలో ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఫ్రూట్స్‌ తీసుకోవటం ఉత్తమం. జంక్‌ ఫుడ్‌కు దూరంగా ఉండండి. ఎక్కువగా మసాలాలు ఉండే ఆహారం తినకూడదు.
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని