Polavaram: వరద తగ్గాకే పోలవరం కొత్త డయాఫ్రమ్‌ వాల్‌పై నిర్ణయం: సీడబ్ల్యూసీ

పోలవరం వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాత కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం, డిజైన్లపై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌  ఖష్విందర్‌ వోరా తెలిపారు.

Published : 17 Aug 2023 17:59 IST

దిల్లీ: పోలవరం వద్ద వరద ప్రభావం తగ్గిన తర్వాత కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణం, డిజైన్లపై నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌  ఖష్విందర్‌ వోరా తెలిపారు. క్షేత్రస్థాయిలో సమీక్షించాకే డయాఫ్రమ్‌ వాల్‌పై నిర్ణయం తీసుకుంటామన్నారు. వరద తగ్గాక తమ ముందున్న ప్రత్యామ్నాయాలు పరిశీలిస్తామన్నారు. అప్పర్‌, లోయర్‌ కాఫర్‌ డ్యామ్‌లను పరిశీలించాల్సి ఉందన్నారు. డిజైన్‌ విషయంలోనే జల సంఘం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. 

‘‘ఏపీ ప్రభుత్వం జవాబు ఆధారంగా డయాఫ్రమ్‌ వాల్‌పై నిర్ణయం ఉంటుంది. సాంకేతిక వివరాలన్నీ పంపాకే సమీక్షించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకుంటుంది. తప్పనిసరైతే పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తాం. పోలవరంపై నిపుణుల కమిటీ వివరాలతో ఏపీ ప్రభుత్వం నుంచి లేఖ వచ్చింది’’ అని సీడబ్ల్యూసీ ఛైర్మన్‌ తెలిపారు. పోలవరం ప్రాజెక్టు (Polavaram)లో పూర్తిగా కొత్త డయాఫ్రం వాల్ నిర్మించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. పాక్షికంగా కట్టడం కంటే.. పూర్తిస్థాయి నూతన నిర్మాణమే మేలని అంచనా వేస్తోంది. సమయం, ఖర్చు ముఖ్యం కాదని, నిర్మాణ భద్రతే ప్రధానమని అభిప్రాయపడుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని