Top Ten News @ 1PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 1 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 30 Apr 2024 13:19 IST

1. అభ్యంతరకర వీడియోల ఘటన.. ఎంపీ ప్రజ్వల్‌పై సస్పెన్షన్ వేటు

హాసన సిటింగ్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (Prajwal Revanna)పై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. అదే సమయంలో జేడీఎస్ కీలక నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రజ్వల్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. స్వతంత్ర అభ్యర్థులకు ‘గాజు గ్లాసు’.. ఈసీ నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌

స్వతంత్ర అభ్యర్థులకు గాజు గ్లాసు గుర్తు కేటాయిస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయంపై హైకోర్టులో జనసేన పిటిషన్‌ వేసింది. తమకు కేటాయించిన గాజు గ్లాసును ఇతర అభ్యర్థులకు కేటాయించొద్దంటూ ఆ పార్టీ జనరల్ సెక్రటరీ ఈ పిటిషన్‌లో కోరారు. ఈ గుర్తును ఫ్రీ సింబల్ నుంచి తొలగించాలని ఈసీకి వినతి పత్రం ఇచ్చామని ఆ పార్టీ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. విజయవాడలో విషాదం.. ప్రముఖ వైద్యుడు సహా ఐదుగురి మృతి

విజయవాడ నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. పటమట ప్రాంతంలో ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి చెందారు. స్థానికంగా నివాసముంటున్న ప్రముఖ ఆర్థోపెడిక్‌ వైద్యుడు డి.శ్రీనివాస్‌ (40)తో పాటు ఆయన భార్య ఉష (38) , ఇద్దరు పిల్లలు శైలజ (9), శ్రీహన్‌ (8), తల్లి రమణమ్మ (65) మరణించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. తండ్రి పేరును జగనే ఛార్జిషీట్‌లో చేర్పించారు: షర్మిల

ఇవి న్యాయానికి, నేరానికి మధ్య జరుగుతున్న ఎన్నికలని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల అన్నారు. ఈ ఎన్నికల్లో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి బిడ్డ ఓడిందంటే.. నేరం గెలిచిందని అర్థమని పేర్కొన్నారు. రావులపాలెంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ‘‘ధర్మానికి, డబ్బుకు మధ్య జరుగుతున్న ఎన్నికలివి. రాజశేఖర్‌రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో చేర్చింది కాంగ్రెస్సేనని ఆరోపిస్తున్నారు. ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో కూడా లేకపోతే ఏఏజీ సుధాకర్‌రెడ్డి చేర్పించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఛత్తీస్‌గఢ్‌లో మళ్లీ ఎన్‌కౌంటర్‌.. ఏడుగురు మావోయిస్టులు హతం

నారాయణ్‌పుర్‌ జిల్లాల సరిహద్దుల్లో మంగళవారం మావోయిస్టులు, భద్రతా సిబ్బంది మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్‌ (Encounter)లో ఏడుగురు నక్సల్స్‌ హతమయ్యారు. 15 రోజుల వ్యవధిలో ఈ ప్రాంతంలో ఎన్‌కౌంటర్‌ జరగడం ఇది రెండోసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ‘అసహనంతోనే ఫేక్‌ వీడియోలు’ : కాంగ్రెస్‌పై మండిపడ్డ అమిత్‌ షా

రిజర్వేషన్ల రద్దుపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా (Amit shah) చెప్పినట్లు ఉన్న వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. తాజాగా అమిత్‌ షా దీనిపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. భారత్‌ సూపర్ పవర్ కావాలని కలలుకంటుంటే..

పాకిస్థాన్‌లోని అతివాద ఇస్లామిక్ నాయకుడు మౌలానా ఫజ్లుర్ రెహ్మాన్ సోమవారం జాతీయ అసెంబ్లీలో ప్రసంగిస్తూ భారత్‌ అభివృద్ధి చెందుతున్న తీరును కొనియాడారు. పరోక్షంగా న్యూదిల్లీ గురించి ఆయన ప్రస్తావిస్తూ‘‘పొరుగు దేశంతో మనల్ని పోల్చుకోండి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సెక్షన్‌ 54F.. బంగారం విక్రయించి ఇల్లు కొనుగోలు చేస్తే పన్నుండదు!

వారసత్వంగా వచ్చిన బంగారు ఆభరణాలను విక్రయించగా పొందిన లాభాలపై పన్ను మినహాయింపునకు అనుమతిస్తూ ఇటీవల ‘ఆదాయ పన్ను అప్పిలేట్‌ ట్రైబ్యునల్‌ (ITAT)’ బెంగళూరు బెంచ్‌ తీర్పు వెలువరించింది. సెక్షన్‌ 54ఎఫ్‌ (Section 54F) కింద ఓ వ్యక్తి చేసుకున్న క్లెయిమ్‌ను ఐటీ సమీక్షాధికారి తిరస్కరించగా.. ఐటీఏటీ దానిపై విచారణ జరిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. 5 రోజుల్లో రూ.3 లక్షల కోట్లు ఎగసిన మస్క్‌ సంపద

టెస్లా, స్పేస్‌ఎక్స్‌ అధినేత, బిలియనీర్‌ ఎలాన్‌ మస్క్‌ (Elon Musk) సంపద ఇటీవల గణనీయంగా పెరిగింది. గత ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో ఆయన వాటాల విలువ 37.3 బిలియన్‌ (దాదాపు రూ.3.11 లక్షల కోట్లు) డాలర్లు ఎగసింది. 2022 మార్చి తర్వాత ఒక వారం వ్యవధిలో ఆయన ఈ స్థాయిలో లబ్ధిపొందడం తొలిసారి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నేను చేయను.. నీకేమైనా ఇబ్బందా?

సోషల్‌ మీడియా యాక్టివ్‌గా ఉండే హీరోయిన్స్‌లో మాళవిక మోహనన్‌ (Malavika Mohanan) ఒకరు. నటనకు కాస్త బ్రేక్‌ ఇచ్చి, సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించాలని ప్లాన్‌ చేసుకున్నారు. అనుకున్నట్లే ‘ఆస్క్‌ మాళవిక’ #AskMalavika పేరిట ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో క్వశ్చన్‌ అండ్‌ ఆన్సర్‌ సెషన్‌ నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని