Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Updated : 30 Apr 2024 09:11 IST

1. మండుటెండల్లో మళ్లీ మరణ మృదంగమా?

పింఛను కోసం ఏప్రిల్‌లో వృద్ధులను సచివాలయాల చుట్టూ తిప్పిన సీఎం జగన్‌, సీఎస్‌, ఉన్నతాధికారులు కలిసి మళ్లీ కుట్రకు తెరలేపారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. మే నెలలోనూ మండుటెండల్లో బ్యాంకుల చుట్టూ తిప్పించాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఎంతమంది చనిపోయినా పర్లేదన్న ధోరణితో ముఖ్యమంత్రి శవ రాజకీయం చేస్తున్నారని ధ్వజమెత్తారు. కర్నూలు జిల్లా గూడూరులో సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

2. వివేకా హత్యలో సునీల్‌.. తగిన ఆధారాలున్నాయి

మాజీమంత్రి వివేకా హత్యలో సునీల్‌ యాదవ్‌ పాల్గొన్నట్లు అన్ని ఆధారాలు ఉన్నాయని సీబీఐ సోమవారం తెలంగాణ హైకోర్టుకు నివేదించింది. హత్య జరిగిన సమయంలో సునీల్‌.. వివేకా ఇంట్లో ఉన్నట్లు గూగుల్‌ టేక్‌ అవుట్‌ ద్వారా తేలిందని పేర్కొంది. వివేకా హత్య కేసులో రెండో నిందితుడైన సునీల్‌ యాదవ్‌ దాఖలు చేసిన బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం జస్టిస్‌ కె.లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

3. ఎవరా 15!.. నేడు సెలక్షన్‌ కమిటీ సమావేశం

టీ20 ప్రపంచకప్‌ సమీపిస్తున్నా భారత జట్టుపై ఇంకా స్పష్టత లేదు. చాలా స్థానాలకు ఆటగాళ్ల మధ్య పోటీ ఉండడంతో ఎన్నో ఊహాగానాలు. ఈ అనిశ్చితికి తెరపడడానికి ఎంతో సమయం లేదు. ధనాధన్‌ టోర్నీకి జట్లను ప్రకటించడానికి మే 1 తుది గడువు అయిన నేపథ్యంలో వచ్చే కొన్ని గంటల్లో ఎప్పుడైనా బీసీసీఐ ఆ 15 మంది ఎవరో వెల్లడించనుంది. ప్రపంచకప్‌ జట్టు ఎంపిక కోసం కౌంట్‌డౌన్‌ మొదలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

4. జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దాం

అరాచకం తప్ప అభివృద్ధి చేయని జగన్‌కు పొలిటికల్‌ హాలిడే ఇచ్చేద్దామని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజలకు పిలుపునిచ్చారు. మే 13న మీరు ఓటుతో కొడితే వైకాపా కుంభస్థలం బద్దలవ్వాలంటూ ప్రజల్ని ఉత్సాహపరిచారు. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజకవర్గం గణపవరంలలో సోమవారం నిర్వహించిన వారాహి విజయభేరి సభలు, పిఠాపురం రోడ్‌షోలో ఆయన ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

5. జగన్‌ అరాచక కేళి.. జనం కావాలా బలి..!

పింఛన్ల పంపిణీ విషయంలో తలెత్తే విషత్కర పరిణామాలను అవకాశంగా మలుచుకుని ఎన్నికల్లో లబ్ధి పొందాలని వైకాపా విశ్వప్రయత్నాలు చేస్తోంది. మరో విష ప్రచారానికి తెరలేపుతూ వైకాపా వాట్సప్‌ గ్రూపుల్లో ప్రచారాన్ని చేపట్టింది. ‘జగనన్నపై ఉన్న కోపంతో చంద్రబాబు మార్చి పింఛను డబ్బులు ఇంటింటికీ అందించకుండా అవ్వాతాతలపై కక్ష తీర్చుకున్నారు. ఇప్పుడు సచివాలయాల్లో కూడా కాకుండా బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. ఇకపై మండుటెండల్లో అవ్వాతాతలు బ్యాంకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వస్తోంది’.. అంటూ ప్రచారానికి దిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

6. మత్తులో ముంచారు.. మొత్తంగా దోచారు!

వైకాపా అధికారంలోకి వచ్చాక మద్యం దుకాణాల వద్ద సిబ్బందిగా ఉపాధ్యాయులను నియమించారు. ప్రపంచంలోనే ఎక్కడా లేని కొత్తకొత్త బ్రాండ్లను తీసుకొచ్చారు. గత ప్రభుత్వ హయాంలో ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా ఆపేశారు. వైకాపా ప్రభుత్వంలో కనీవినీ ఎరుగని రకాలతో మద్యం ప్రియులకు నిషా ఎక్కించారు. తాగేవారికి నీరసం ఆవహించి కడుపునొప్పి, విరేచనాలు, కాలేయ సంబంధిత వ్యాధులు వచ్చేలా చేశారు. మద్యం చుక్క గొంతులో పడనిదే లేవలేని స్థితికి తీసుకొచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

7. వైకాపా అరాచకీయం!

 ‘‘గుడివాడలో ఇటీవల రాజీనామాలు చేసిన ఒక్కో వాలంటీరుకు రూ.లక్షల్లో తాయిలాలు ఇచ్చి.. వారిని పోలింగ్‌ బూత్‌ ఏజెంట్లుగా వైకాపా తరఫున కూర్చోబెట్టేందుకు ఎమ్మెల్యే కొడాలి నాని వర్గం ప్రయత్నాలు ఆరంభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే వారికి వైకాపా కొత్త మ్యానిఫెస్టోతోపాటు బూత్‌ ఏజెంటుగా కూర్చోబెట్టాక ఏం చేయాలి? ఎలా చేయాలనే అంశాలపై వైకాపా కార్యాలయంలో తర్ఫీదు ఇచ్చినట్టు తెలిసింది. రాజీనామా చేసిన వాలంటీర్లను ప్రస్తుతం ఇంటింటికీ పంపి పింఛనుదారులు, లబ్ధిదారులను ప్రభావితం చేసే ప్రయత్నాలు కూడా ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

8.గాలికొదిలేశారు.. అయిదేళ్లు గడిపేశారు

పేదలే ప్రాణమంటారు. వైద్య సేవల్లో ప్రభుత్వం పెద్ద పీట వేసిందంటారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పిస్తున్నట్లు ప్రగల్భాలు చెబుతారు. ఆసుపత్రుల్లో మాత్రం గర్భిణులు.. చిన్నారులు.. బాలింతలు ఇలా ఎవ్వరికీ ఊపిరి ఆడనీయరు. పగలు ఎండ తీవ్రత.. రాత్రి దోమల బెడదతో రోగులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇళ్ల నుంచి ఫ్యాన్లు, కూలర్లు తెచ్చుకుని  ఉపశమనం పొందుతున్నారు. ఇదీ వైకాపా పాలనలో పరిస్థితి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

9. ప్రచారంలో బలగం

 ఇన్నాళ్లూ ప్రజాప్రతినిధులుగా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానాన్ని ఏర్పర్చుకున్న పలువురు సీనియర్‌ నేతలు.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో తమ వారసులకూ రాజకీయ పునాది వేయాలని నడుంబిగించారు. వారి రాజకీయ అరంగేట్రాన్ని ఘనంగా చాటాలని శ్రమిస్తున్నారు. మొన్నటి దాకా వారసులకు టికెట్లు ఇప్పించడంలో చాణక్యం ప్రదర్శించిన వీరు.. ఇప్పుడు వారి గెలుపు కోసమూ చక్రం తిప్పుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

10. 955 టీఎంసీలు అవసరం

కృష్ణా జలాల్లో తమ అవసరాలు 2,099 టీఎంసీలుగా రెండు తెలుగు రాష్ట్రాలు బ్రిజేష్‌ కుమార్‌ ట్రైబ్యునల్‌కు నివేదించాయి. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ తమ అవసరం 1,144 టీఎంసీలుగా పేర్కొనగా, తెలంగాణ 954.9గా తెలిపింది. తాగు నీటికి తీసుకొనే నీటిలో 20 శాతం, పారిశ్రామిక అవసరాలకు వినియోగించే నీటిలో ఇంకా తక్కువ లెక్కలోకి తీసుకోవాల్సి ఉన్నందున తమ వినియోగం 789.8 టీఎంసీలుగా పరిగణించాలని తెలంగాణ కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని