
Published : 11 Jun 2021 15:53 IST
హన్మకొండలో కొండచిలువ హల్‌చల్!
హైదరాబాద్: హన్మకొండ పరిమళకాలనీలో కొండచిలువ కొద్దిసేపు హల్ చల్ చేసింది. సుమన్ అనే వ్యక్తి ఇంటి పరిసరాల్లో ఆరు అడుగుల కొండచిలువ కనిపించగా కుటుంబ సభ్యులు హడలెత్తిపోయారు. వెంటనే జూ అధికారులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలికి చేరుకున్న సహాయక సిబ్బంది కొండచిలువను బంధించారు. కొండచిలువను ములుగు అటవీ ప్రాంతంలో వదిలివేస్తామని అధికారులు తెలిపారు.
ఇవీ చదవండి
Tags :