Kishan Reddy: తెలంగాణకు రైల్వే బడ్జెట్ కేటాయింపులు పెరిగాయి: కిషన్‌రెడ్డి

2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ₹.3,048 కోట్లు కేటాయించినట్లు

Published : 20 Feb 2022 17:41 IST

న్యూదిల్లీ: 2022-23 సంవత్సరానికి గానూ కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు సమర్పించిన బడ్జెట్‌లో తెలంగాణలో రైల్వేల అభివృద్ధికి ₹.3,048 కోట్లు కేటాయించినట్లు కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో రైల్వే పనుల కోసం 2021-22 ఆర్థిక సంవత్సరంలో ₹2,420 కోట్లు కేటాయించిన కేంద్ర ప్రభుత్వం, వచ్చే ఆర్థిక సంవత్సంలో కేటాయింపులను 25% పెంచినట్లు వెల్లడించారు. 2014-20 మధ్య కాలంలో కేటాయించిన సగటు వార్షిక రైల్వే బడ్జెట్ కంటే 3 రెట్లు అధికంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో కేటాయింపులు చేశారని తెలిపారు. బడ్జెట్‌లో తెలంగాణకు కేటాయింపులకు సంబంధించిన వివరాలను ట్విటర్‌ వేదికగా మంత్రి కిషన్‌రెడ్డి పంచుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 1300 కి.మీ. లకు పైగా రైల్వే పనులు ఆలస్యంగా నడుస్తున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న ఈ సమస్యలపై చొరవ తీసుకుని వెంటనే పరిష్కరించాలని కోరారు. తెలంగాణ ప్రజలకు రైల్వేలను మరింత చేరువ చేయడానికి సహకరించాలని కోరుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాసినట్లు తెలిపారు.

మరోవైపు నరేంద్రమోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా రైల్వేల ఆధునికీకరణలో భాగంగా అనేక అభివృద్ధి కార్యక్రమాల చేపడుతున్నట్లు కిషన్‌రెడ్డి వివరించారు. రాష్ట్రంలో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయన్నారు. అందులో భాగంగా రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్ల నిర్మాణం, డబ్లింగ్ లైన్ల నిర్మాణం, అవసరమున్న చోట మూడో లైన్ నిర్మాణం,● రైల్వే లైన్ల విద్యుద్దీకరణ, రైల్వే రోడ్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు.

రాష్ట్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన రైల్వే మార్గాలివేనంటూ కిషన్‌రెడ్డి పంచుకున్న వివరాలు..

* కాజీపేట్ - విజయవాడ : 220 కి.మీ.

* కాజీపేట్ - బలార్ష : 201 కి.మీ.

* మణుగూరు - రామగుండం : 200 కి.మీ.

* మనోహరాబాద్ - కొత్తపల్లి : 151 కి.మీ.

కృష్ణా - వికారాబాద్ : 145 కి.మీ.

* బోధన్ - లాతూర్ : 134 కి.మీ.

* కొండపల్లి - కొత్తగూడెం : 82 కి.మీ.

* మునీరాబాద్ - మహబూబ్ నగర్ : 66 కి.మీ.

* కరీంనగర్ - హసన్ పర్తి : 62 కి.మీ.

* భద్రాచలం రోడ్ - సత్తుపల్లి : 54 కి.మీ.

* అక్కన్నపేట్ - మెదక్ : 17 కి.మీ.

* కాజీపేట్ - హసన్ పర్తి రోడ్ : 11 కి.మీ

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని