Railway: రైళ్లలో ఎయిర్‌హోస్టెస్‌ తరహాలో ట్రైన్‌ హోస్టెస్‌ సేవలు!

విమానం ఎక్కగానే స్వాగతం పలుకుతూ.. ప్రయాణికులకు అతిథిమిచ్చే చేసే ఎయిర్‌హోస్టెస్‌ను చూసే ఉంటారు. త్వరలో రైలు ప్రయాణికులకి కూడా అతిథి మర్యాదలు చేసేందుకు ట్రైన్‌ హోస్టెస్‌ రానున్నారు. మహిళా సాధికారతలో భాగంగా దేశంలోని 25 ప్రీమియమ్‌ రైళ్లలో మహిళా ట్రైన్‌ హోస్టెస్‌ను నియమించనున్నట్లు రైల్వేశాఖ

Published : 11 Dec 2021 01:23 IST

దిల్లీ: విమానం ఎక్కగానే స్వాగతం పలుకుతూ.. ప్రయాణికులకు ఆతిథ్యమిచ్చే ఎయిర్‌హోస్టెస్‌ను చూసే ఉంటారు. త్వరలో రైలు ప్రయాణికులకు కూడా అతిథి మర్యాదలు చేసేందుకు ట్రైన్‌ హోస్టెస్‌ రానున్నారు. మహిళా సాధికారతలో భాగంగా దేశంలోని ప్రీమియమ్‌ రైళ్లలో మహిళా ట్రైన్‌ హోస్టెస్‌ను నియమించనున్నట్లు రైల్వేశాఖ వర్గాలు వెల్లడించాయి. ప్రయాణికులు రైలు ఎక్కే సమయంలో స్వాగతం పలకడంతో పాటు.. ఆహారం అందించడం.. ఫిర్యాదులను స్వీకరించడం వీరి విధి. ఈ సిబ్బందిలో మహిళలతో పాటు పురుషులు కూడా ఉంటారని రైల్వే అధికారులు తెలిపారు. ప్రస్తుతం దేశంలో 12 శతాబ్ది, 2 వందేభారత్‌ రైళ్లు.. ఒక గతిమాన్‌, ఒక తేజస్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలుతో కలిపి మొత్తం 25 ప్రీమియమ్‌ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రైళ్లలో ప్రయాణికులకు మెరుగైన సదుపాయాలు కల్పించే క్రమంలోనే ట్రైన్‌ హోస్టెస్‌ సేవలను తీసుకొస్తున్నామని రైల్వేశాఖ వెల్లడించింది. త్వరలోనే వీరి నియామకాలు చేపట్టనున్నట్లు పేర్కొంది. ట్రైన్‌ హోస్టెస్‌తోపాటు రైలు సిబ్బందిలోనూ మహిళలకు పెద్దపీట వేసేందుకు రైల్వేశాఖ సన్నాహాలు చేస్తోంది. ఈ ప్రీమియమ్‌ రైళ్ల నిర్వహణను మహిళా సిబ్బందికి అప్పగించనున్నట్లు సమాచారం. 

Read latest General News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని