Health: అతిగా దాహం వేస్తే ఇలా చేయండి

ఎంత నీరు తాగినా దాహం తీరదు. వేసవిలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. మంచినీరు ఎంత తాగినా చెమట రాదు..మూత్రం పోవాలనిపించదు. 

Updated : 21 May 2022 15:51 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎంత నీరు తాగినా దాహం తీరదు. వేసవిలో అయితే మరీ ఎక్కువగా ఉంటుంది. మంచినీరు ఎంత తాగినా చెమట రాదు..మూత్రం పోవాలనిపించదు. చివరికి కూల్‌డ్రింక్‌ను కూడా ఆశ్రయిస్తారు. కానీ ఆరోగ్యానికి మేలు చేయని ఈ పానీయాలతో వేసవి దాహం తీరదు. ఇలాంటి సమస్యకు ఎలా అడ్డుకట్ట వేయాలి..? పరిష్కార మార్గాలను వైద్యులు సూచించారు.

* వేసవిలో నీరు ఎంత తాగినా నాలుక పిడుచకట్టుకొని పోతుంది. అలా అని ఇష్టం వచ్చినట్టు ఏదీ పడితే అది తాగొద్దు.

* యాలకులు, అతి మధురం, ఉసిరిక పొడి, మిరియాలు, పంచదార బాగా కలిపి దంచి రోజుకు రెండుసార్లు చెంచా చొప్పున తీసుకుంటే దప్పిక తీరుతుంది.

* కొన్ని చలువ మిరియాలను నోట్లో వేసుకొని చప్పరిస్తే అతి దాహం తగ్గుతుంది. 

* దనియాలను కషాయంగా కాచి దానిలోకి కొంత పంచాదార కలుపుకొని తాగితే దాహం సమస్య ఇట్టే తగ్గిపోతుంది.

* ఎండు ఖర్జూరం, ఎండు ద్రాక్ష కలిపి నీళ్లలో నానపెట్టి ఆ నీటిని తాగుతుంటే అతి దాహం సమస్యగా మారకుండా ఉంటుంది. 

* చల్లని నీటిలో కాస్త పంచదార, నిమ్మరసం కలిపి తీసుకున్నా దాహం వేయదు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని