Telangana News: త్వరలోనే అన్నదాతల ఖాతాల్లో ‘రైతుబంధు’: నిరంజన్‌రెడ్డి

త్వరలోనే రాష్ట్రంలోని అన్నదాతలకు రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే

Updated : 22 Jun 2022 15:30 IST

హైదరాబాద్‌: త్వరలోనే రాష్ట్రంలోని అన్నదాతలకు రైతుబంధు పెట్టుబడి సాయం జమ చేస్తామని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే ఆర్థిక, వ్యవసాయశాఖలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గతంలోలాగే ఈ వానాకాలం కూడా సకాలంలో సొమ్ము జమ చేస్తామని.. రైతులెవరూ ఆందోళనకు పడవద్దని వెల్లడించారు. హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లోని రైతుబంధు సమితి కార్యాలయంలో వ్యవసాయ శాఖ కాల్‌ సెంటర్‌ను మంత్రి ప్రారంభించారు. త్వరలోనే టోల్‌ ఫ్రీ నంబర్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను రైతులకు వివరించేందుకు, రైతుల విజ్ఞప్తులు స్వీకరించడం కోసమే ఈ కాల్‌ సెంటర్‌ను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. రైతు బంధు, రైతు బీమా, ఇతర పథకాలకు సంబంధించి ఏ ఇతర వివరాల కోసమైనా కాల్ సెంటర్ ఉపయోగపడుతుందని మంత్రి నిరంజన్‌ రెడ్డి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని