
Health: వేసవిలో చర్మాన్ని రక్షించుకోండి ఇలా..
ఇంటర్నెట్ డెస్క్: వేసవి వచ్చిందంటే ఎన్నో సమస్యలు వెంటాడుతాయి. అందులో ప్రధానమైనది చర్మ సంరక్షణ..వేసవి తీవ్రత పెరిగి ఉష్ణోగ్రత 40 డిగ్రీలు దాటితే రకరకాల ఇబ్బందులు వస్తాయి. జట్టు రాలిపోవడం, చర్మంపై చెమట పొక్కులు, సెగ్గడ్డలు, మొహంపై నల్ల, ఎర్ర మచ్చలు చికాకు పెట్టిస్తాయి. వీటిని అధిగమించడానికి ఏం చేయాలో డెర్మటాలజిస్టు సందీప్ పలు సూచనలు చేశారు. అవి ఏంటో చూడండి.
* చలికాలం నుంచి ఎండాకాలంలోకి మారినపుడు జట్టు ఎక్కువగా ఊడుతుంది. కోల్ట్ ఇన్‌ఫెక్షన్, పరీక్షల ఒత్తిడితోగానీ జట్టు రాలిపోతుంది. ఆహారంలో మార్పులు, మంచినీటితో వారానికి రెండుసార్లు తల స్నానం చేస్తే జట్టు రాలకుండా చూసుకోవచ్చు.
* చెమట అధికంగా పట్టడంతో చుండ్రు అధికంగా వస్తుంది. తల నుంచి ఆయిల్ విడుదల కావడంతో దుమ్మును పట్టేస్తుంది. దాంతో చుండ్రు సమస్య మొదలవుతుంది.
* ముఖం మీద నూనె రావడంతో మొటిమలు ఎక్కువగా వస్తాయి. కొన్నిసార్లు చీము పట్టి గడ్డలుగా కూడా మారుతాయి. గడ్డలను వత్తేయకుండా వైద్యులను సంప్రదించాలి.
* పెదవులు బాగా దెబ్బతింటాయి. లిప్‌బామ్స్ పెట్టుకుంటే అవి నలుపు కాకుండా ఉంటాయి. ఎండకు వెళ్లినా, వెళ్లకపోయినా తరచుగా లిప్‌బామ్ పెదవులకు రాయాలి.
* ఎండలతో మొహంపై మంగుమచ్చలు ఎక్కువగా వస్తాయి. ఎండకు పోయినా పోకపోయినా ఉదయం, సాయంత్రం సన్‌స్క్రీన్ లోషన్ పెట్టుకోవాలి.
* వేసవిలో సరిగా నీరు తాగకపోవడంతో సెగ్గడ్డలు అధికంగా వస్తాయి. అవి శరీరంలో ఎక్కడయినా రావొచ్చు. చర్మంపై ఉన్న వెంట్రుకల వద్ద బ్యాక్టీరియా పెరిగి గడ్డలు రానున్నాయి. ఇవి రాకుండా ఉండాలంటే ఎంత వీలయితే అంతగా నీటిని తాగాలి.రాగి జావ తాగాలి.
* చెమట కాయలు వచ్చినపుడు విటమిన్ సి మాత్రలు వేసుకోవాలి. కొంచెం పులుపు ఎక్కువగా తీసుకోవాలి. చల్లని ప్రదేశంలో ఉండాలి. యాంటీ ఫంగల్ పౌడర్ వేసుకోవాలి.
* సన్‌స్క్రీన్ వాడితే వెంటనే పని చేయదు. 20 నిమిషాల తర్వాత పని చేస్తుంది. నలుపు వస్తుందన్న భయం వట్టిదే. ఎంత ఎస్‌పీఎఫ్ ఎక్కువగా ఉంటే అంత మంచిది. మామిడి, పెరుగు తింటే చెమట కాయలు రావు.
* రాగి జావ, క్యారెట్, బాదం, తాటిముంజలు, కొబ్బరి నీరు, వాల్‌నట్స్ తినడంతో వేసవి వచ్చే సమస్యలను అధిగమించడానికి చాలా అవకాశం ఉంటుంది.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగినంత జాగ్రత్త వహించి ఉత్పత్తులు / సేవల గురించి విచారణ చేసి కొనుగోలు చేయాలి. వాటి నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
-
Viral-videos News
Viral video: రియల్ హీరో.. కరెంటు షాక్‌తో విలవిల్లాడుతున్న ఆవును రక్షించిన యువకుడు
-
India News
Sidhu Moose Wala: సిద్ధూ మూసేవాల కేసులో షార్ప్‌షూటర్ అరెస్టు
-
Sports News
IND vs ENG: శ్రేయస్‌ను తెలివిగా బుట్టలో వేసిన ఇంగ్లాండ్.. వీడియో చూడండి
-
Movies News
Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
-
Politics News
BJP: భాజపా బలోపేతానికి మూడు కమిటీలను ప్రకటించిన బండి సంజయ్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Upasana: ‘ఉపాసన.. పిల్లలెప్పుడు’.. అని అడుగుతున్నారు.. సద్గురు సమాధానం
- Kaali: ‘కాళీ’ డాక్యుమెంటరీ పోస్టర్ వివాదాస్పదం.. దర్శకురాలిపై మండిపడుతోన్న నెటిజన్లు
- IND vs ENG: నాలుగో రోజు ముగిసిన ఆట.. భారత్ గెలవాలంటే 7 వికెట్లు తీయాల్సిందే!
- Vishal: ఫైట్ సీన్స్ చేస్తుండగా కుప్పకూలిన హీరో విశాల్
- Tamil Nadu: తమిళనాడుకు స్వయం ప్రతిపత్తి.. సంచలన వ్యాఖ్యలు చేసిన డీఎంకే ఎంపీ
- Mamata Banerjee: మహారాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. దీదీ జోస్యం
- Emirates: గాల్లో విమానానికి రంధ్రం.. అలాగే 14 గంటల ప్రయాణం!
- News In Pics: చిత్రం చెప్పే సంగతులు
- America: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం.. ఆరుగురు మృతి
- కొత్త పెళ్లికూతుళ్లు.. వీటి గురించే తెగ వెతికేస్తున్నారట!