Talasani Srinivas yadav: సెప్టెంబరు 2 నుంచి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీ: తలసాని శ్రీనివాస్‌యాదవ్‌

సెప్టెంబరు 2వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు.

Published : 19 Aug 2023 20:27 IST

హైదరాబాద్: సెప్టెంబరు 2వ తేదీ నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) పరిధిలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్ తెలిపారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పంపిణీపై అధికారులతో మంత్రి సమీక్షించారు. జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్, జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఇతర అధికారులు పాల్గొన్నారు. అర్హులైన పేద కుటుంబాలకు పంపిణీ చేయనున్న డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల నిర్మాణం, అందంగా తీర్చిదిద్దడం, పంపిణీ కోసం చేయాల్సిన ఏర్పాట్లపై విస్తృతంగా చర్చించారు.

మొదటి విడతలో 8 ప్రాంతాల్లో 12వేల మంది అర్హులకు ఇళ్లను పంపిణీ చేయబోతున్నామని తలసాని ప్రకటించారు. అందుకోసం ఈ నెల 24వ తేదీన హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్‌లో డ్రా పద్ధతిలో లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న పేద కుటుంబాలు గొప్పగా ఆత్మగౌరవంతో బతకాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం అని తెలిపారు. భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ఒక్క తెలంగాణలోనే సకల మౌలిక సౌకర్యాలతో కూడిన డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లను ప్రభుత్వం నిర్మించి ఉచితంగా అందజేస్తోందని తలసాని వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని