Droupadi Murmu: హైదరాబాద్‌కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఏర్పాట్లపై సీఎస్‌ సమీక్ష

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు.

Published : 13 Dec 2023 16:10 IST

హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) హైదరాబాద్‌ పర్యటన కోసం పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్‌) శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. రాష్ట్రపతి శీతాకాల విడిది కోసం హైదరాబాద్ (Hyderabad) నగరానికి రానున్న నేపథ్యంలో ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ నెల 18వ తేదీన హైదరాబాద్‌కు శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి రానున్న విషయం తెలిసిందే. ఐదు రోజులపాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. తిరిగి ఈ నెల 23న దిల్లీకి వెళ్లనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని