icon icon icon
icon icon icon

YS Sharmila: అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు మాకు తెలియదు: వైఎస్‌ షర్మిల

తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు.

Published : 06 May 2024 11:25 IST

కడప: తన తండ్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి పేరును సీబీఐ ఛార్జిషీట్‌లో పెట్టించిన వారికి ఏఏజీ పదవి ఇచ్చారని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వివేకా హత్య కేసుపై మాట్లాడుతూ జగన్‌ అధికారంలో లేనప్పుడు సీబీఐ విచారణ కావాలని అడిగారని గుర్తుచేశారు. అధికారంలోకి రాగానే ఎందుకు వద్దన్నారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. జగన్‌ను చూసుకునే తెలంగాణ నేత రాఘవరెడ్డి తనపై ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. రూ.వెయ్యి కోట్లు తీసుకున్నట్లు రుజువులు ఉంటే బయటపెట్టాలన్నారు. ఇటీవల కడప ఎంపీ అవినాష్‌రెడ్డి చేసిన వ్యాఖ్యల పైనా షర్మిల స్పందించారు. తన భర్త అనిల్‌ కుమార్‌ భాజపా నేతను ఎక్కడా కలవలేదు.. కలవరని చెప్పారు. అవినాష్‌ మాదిరి అర్ధరాత్రి గొడ్డలి రాజకీయాలు తమకు తెలియదని ఎద్దేవా చేశారు. 

‘‘కంటికి కనిపించని పొత్తును జగన్‌ కొనసాగిస్తున్నారు. క్రైస్తవులపై దాడి ఘటనలో కూడా వైకాపా స్పందించలేదు. అదానీ, అంబానీలకు ప్రభుత్వ ఆస్తులను సీఎం దోచిపెట్టారు. జగన్‌ భాజపా దత్తపుత్రుడని నిర్మలా సీతారామన్‌ చెప్పారు. మోదీ వారసుడిగానే ఆయన ఉన్నారు.. వైఎస్సార్‌ వారసుడిగా కాదు. వైకాపా ఇంత అవినీతిలో కూరుకుపోయినా భాజపా ఎందుకు చర్యలు తీసుకోలేదు?. జగన్‌ ఆ పార్టీకి దత్తపుత్రుడు, తొత్తు కాబట్టే చర్యలు తీసుకోలేదు’’ అని షర్మిల విమర్శించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img