తెలంగాణ ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖరారు

తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖారారైంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీ

Updated : 06 Mar 2021 17:18 IST

హైదరాబాద్‌: తెలంగాణలో ఇంజినీరింగ్, ఫార్మా, వ్యవసాయ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంసెట్‌ షెడ్యూల్‌ ఖారారైంది. ఈ నెల 18వ తేదీన ఎంసెట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ఎంసెట్‌ కమిటీ వెల్లడించింది. ఈ నెల 20 నుంచి మే 18వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నట్లు తెలిపింది. ఆలస్య రుసుంతో జూన్‌ 28 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చని వెల్లడించింది.

జులై 5 నుంచి 9 వరకు ఎంసెట్ పరీక్షను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఇప్పటికే ప్రకటించింది. జులై 5, 6 తేదీల్లో ఎంసెట్‌ అగ్రికల్చర్‌, ఫార్మా పరీక్షలు జరగనున్నాయి. జులై 7, 8, 9 తేదీల్లో ఎంసెట్‌ ఇంజినీరింగ్‌ పరీక్షలు జరగనున్నట్లు కమిటీ వెల్లడించింది. అయితే ఇంటర్ మొదటి సంవత్సరంలో వంద శాతం, ద్వితీయ సంవత్సరంలో 70 శాతం సిలబస్‌నే ఎంసెట్‌లో ఇవ్వాలని ఇప్పటికే కమిటీ నిర్ణయించింది. ఈ ఏడాది కూడా జేఎన్‌టీయూహెచ్ రెక్టార్ గోవర్దన్ పరీక్షల కన్వీనర్‌గా వ్యవహరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని