
Updated : 31 Dec 2021 14:14 IST
KTR: నల్గొండలో ఐటీ హబ్‌కు కేటీఆర్ శంకుస్థాపన
నల్గొండ: నల్గొండ జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఐటీ హబ్‌కు శంకుస్థాపనతో పాటు ఎస్సీ, ఎస్టీ వసతి గృహాలను మంత్రి ప్రారంభించారు. ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఐటీహబ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. మూడు వేల మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా దీన్ని నిర్మించనున్నారు. ఐటీ హబ్‌ను 18నెలల్లో పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అంతకుముందు నల్గొండలో కేటీఆర్‌కు తెరాస నేతలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా పట్టణంలో పార్టీ శ్రేణులు ద్విచక్రవాహన ర్యాలీ నిర్వహించాయి.
Tags :