Tirumala: తిరుమల ఘాట్‌రోడ్‌లో కొండచరియలు పరిశీలించిన కేరళ నిపుణుల బృందం

ఘాట్‌ రోడ్‌లో కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ స్లైడ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ కింద అంతర్జాతీయ ప్రాజెక్టు చేస్తున్న నిపుణుల బృందం..

Published : 06 Dec 2021 01:20 IST

తిరుమల: తిరుమల ఘాట్‌ రోడ్‌లో కొండచరియలను కేరళ కొల్లంలోని అమృత విశ్వవిద్యాలయం నుంచి వరల్డ్‌ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఆన్‌ ల్యాండ్‌ స్లైడ్‌ డిజాస్టర్‌ రిడక్షన్‌ కింద అంతర్జాతీయ ప్రాజెక్టు చేస్తున్న నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. కొండ చరియలు విరిగిపడకుండా మందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనల కోసం తితిదే వీరిని ఆహ్వానించింది. ల్యాండ్‌ స్లైడ్స్‌ నిపుణులు కొండ చరియలు విరిగిపడిన ప్రాంతంలో పునరుద్ధరణ పనులు, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించుకొని సమగ్ర సర్వే నిర్వహించి తితిదేకు నివేదిక అందించనున్నారు. అమృత విశ్వవిద్యాలయం స్ట్రాటజిక్‌ ఇన్షియేటివ్స్‌ రీసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ విభాగానికి చెందిన నిపుణులు ప్రొఫెసర్‌ మనీషా, నిర్మల వాసుదేవన్‌, సుదేష్‌ విద్వాన్‌, తితిదే డీఎఫ్‌ఓ శ్రీనివాసులు రెడ్డి, ఈఈ సురేంద్రనాథ్‌రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని