TS News: విద్యా సంవత్సరాన్ని ప్రకటించిన ప్రభుత్వం.. స్కూళ్లకు సెలవులు ఇలా..

కరోనా తగ్గుముఖం పట్టడంతో ఈ నెల 1 నుంచి పాఠశాలలు తెరిచిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ  2021-22  విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది

Updated : 04 Sep 2021 21:43 IST

హైదరాబాద్‌: కరోనా తగ్గుముఖం పట్టడంతో తెలంగాణలో ఈ నెల 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్యాశాఖ  2021-22  విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. 213 పనిదినాలతో కొత్త విద్యా సంవత్సరాన్ని ప్రకటించింది. 47 రోజుల ఆన్‌లైన్‌ తరగతులను పరిగణనలోకి తీసుకుంది. అక్టోబర్‌ 6 నుంచి 17 వరకు దసరా సెలవులు ఇవ్వనున్నారు. అలాగే, మిషనరీ పాఠశాలలకు డిసెంబర్‌ 22 నుంచి 28 వరకు క్రిస్మస్‌ సెలవులు.. జనవరి 11 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు.. ఏప్రిల్‌ 24 నుంచి జూన్‌ 12 వరకు వేసవి సెలవులు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని