
Updated : 02 Dec 2021 21:12 IST
TS News: సూర్యాపేట జిల్లా వైద్యాధికారికి కరోనా.. ఇటీవలే విదేశాల నుంచి వచ్చిన కుమారుడు
తాళ్లగడ్డ: సూర్యాపేట జిల్లా వైద్యాధికారి డాక్టర్ కోటాచలం కరోనా బారిన పడ్డారు. ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్.. రెండు టెస్టుల్లోనూ గురువారం ఆయనకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఐదు రోజుల క్రితం ఆయన కుమారుడు విదేశాల నుంచి తిరిగి రావడం కలకలం రేపుతోంది. విదేశాల నుంచి వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులంతా తిరుపతి దైవ దర్శనానికి వెళ్లి.. రెండు రోజుల క్రితమే తిరిగి స్వగ్రామం తిరుమలగిరికి చేరుకున్నారు. స్వల్ప లక్షణాలు కనిపించడంతో కుటుంబ సభ్యులు పరీక్షలు చేయించుకోగా ఆరుగురికి కరోనా నిర్ధారణ అయింది. ప్రస్తుతం వీరంతా హోం ఐసోలేషన్‌లో ఉన్నారు.
Tags :