AP News: గుంటూరు జీజీహెచ్‌లో మూడో రోజూ కొనసాగిన జూనియర్‌ డాక్టర్ల ఆందోళన

గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో జూనియర్‌ డాక్టర్లు మూడో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విధులు బహిష్కరించి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ఎదుట

Updated : 09 Dec 2021 15:20 IST

గుంటూరు: గుంటూరు ప్రభుత్వ సర్వజనాసుపత్రి (జీజీహెచ్‌)లో జూనియర్‌ డాక్టర్లు మూడో రోజు ఆందోళన కొనసాగిస్తున్నారు. విధులు బహిష్కరించి కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయాల ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. జూనియర్ డాక్టర్లపై ఓ రోగి బంధువు దాడి చేయడాన్ని నిరసిస్తూ మూడు రోజులుగాయ వారు నిరసన చేపడుతున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటికే పోలీసులు ముగ్గురిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడిని కూడా అరెస్టు చేయాలంటూ జూనియర్ వైద్యులు డిమాండ్ చేస్తున్నారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేసేంతవరకు తాము విధులకు హాజరుకాబోమని జూనియర్ డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని