TS News: నిండుకుండలా సాగర్‌ జలాశయం.. కొనసాగుతున్న వరద

 నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది.

Updated : 23 Feb 2024 20:11 IST

నల్గొండ: నాగార్జున సాగర్‌ జలాశయం నిండుకుండలా దర్శనమిస్తోంది. జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. దీంతో 10 గేట్లు 5 అడుగుల మేర ఎత్తి 81వేల క్యూసెక్కుల నీటిని కిందకు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ఇన్‌ఫ్లో 1,29,791 క్యూసెక్కులు ఉండగా ఔట్‌ఫ్లో కూడా అంతే ఉంది. కాగా జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా దాదాపు ఆ మేరకు నీరు ఉంది. సాగర్‌ పూర్తి నీటి నిల్వ 312టీఎంసీలు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని