చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు వైకాపా రంగులు.. హైకోర్టులో విచారణ

ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు, మోటార్లకు వైకాపా రంగులు వేస్తున్నారంటూ ‘జై భీమ్ యాక్సిస్ జస్టిస్’ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు

Published : 08 Sep 2021 16:27 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేస్తున్న చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలకు, మోటార్లకు వైకాపా రంగులు వేస్తున్నారంటూ ‘జై భీమ్ యాక్సిస్ జస్టిస్’ సంస్థ కృష్ణా జిల్లా అధ్యక్షుడు సురేశ్‌ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ వ్యయంతో ఏర్పాటు చేసే భవనాలకు పార్టీ రంగులు వేయడంపై పిటిషనర్ అభ్యంతరం తెలిపారు. వాదనలు విన్న న్యాయస్థానం పంచాయతీ రాజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌లను ఈనెల 16న కోర్టుకు వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశిస్తూ.. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని