Offbeat: పాముల కోసం పెట్టిన పొగ.. ₹13 కోట్ల ఇంటిని కాల్చేసింది..!

తానొకటి తలిస్తే.. దైవం ఒకటి తలచినట్లు.. ఉంది అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన వ్యక్తి పరిస్థితి. ఇంటికి పట్టిన పాముల పీడను వదిలించుకుందామని అతడు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది.

Updated : 07 Dec 2021 16:30 IST

అన్నాపోలిస్‌: తానొకటి తలిస్తే దైవం ఒకటి తలచినట్లుంది అమెరికాలోని మేరీలాండ్‌కు చెందిన వ్యక్తి పరిస్థితి. ఇంటికి పట్టిన పాముల పీడను వదిలించుకుందామని అతడు చేసిన ప్రయత్నం కాస్తా బెడిసి కొట్టింది. దాంతో పదివేల చదరపు అడుగుల్లో ఉన్న 1.8 మిలియన్ డాలర్ల విలువైన ఇల్లు మంటల్లో కాలిపోయింది. ఓ మీడియా సంస్థ వెల్లడించిన కథనం ప్రకారం.. మేరీలాండ్‌కు చెందిన ఓ వ్యక్తి ఇంట్లో పాముల బెడద ఎక్కువగా ఉంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోవడంతో ఈ సారి చాలా పెద్ద రిస్క్ చేశాడు. బొగ్గును ఉపయోగించి పొగపెట్టాలనుకున్నాడు. 

అయితే ఇంట్లో మండే స్వభావం కలిగిన వస్తువులకు దగ్గరగా బొగ్గును ఉంచడంతో అవి కాలడంతో పాటు ఇంటికి నిప్పంటుకుంది. దాంతో ఇల్లు కాలి లబోదిబోమన్నాడు. దీనికి సంబంధించిన చిత్రాలను అగ్నిమాపక శాఖ ట్విటర్‌లో షేర్ చేసింది. మంటల వల్ల ఇంటి గోడలు మాత్రమే మిగిలినట్లు తెలుస్తోంది. అయితే ఎలాంటి ప్రాణహాని సంభవించలేదు. ఇక పాములు సంగతేంటో తెలియరాలేదు..!. దీనిపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. మాకూ ఇలాంటి బెడద ఉన్నా.. ఈ ప్రయత్నం మాత్రం ఎప్పుడూ చేయలేదని పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని