Hyderabad: స్పర్శ్‌ హాస్పిస్‌ను ప్రారంభించిన కేటీఆర్‌

జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు అందించడానికి హైదరాబాద్‌లోని ఖాజాగూడ

Updated : 23 Aug 2022 12:33 IST

హైదరాబాద్‌: జీవిత చరమాంకంలో ఉన్నవారికి ఉచిత వైద్యసేవలు అందించడానికి హైదరాబాద్‌లోని ఖాజాగూడ వద్ద ఎకరా విస్తీర్ణంలో నిర్మించిన స్పర్శ్‌ హాస్పిస్‌ కొత్త భవనాన్ని మంత్రి కేటీఆర్‌ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

‘స్పర్శ్‌ హాస్పిస్‌ నుంచి ఆహ్వానం వచ్చే వరకు పాలియేటివ్‌ కేర్‌ అంటే ఏంటో నాకు తెలియదు. దీని గురించి స్వయంగా తెలుసుకుంటే గొప్పగా అనిపించింది. స్పర్శ్‌ హాస్పిస్‌ వేలాది మందికి సాంత్వన కలిగిస్తుంది. ఐదేళ్లలోనే స్పర్శ్‌ హాస్పిస్‌కు మంచి భవనం రావడం సంతోషకరం. అధునాతన భవనంలో పూర్తి వసతులతో 82 పడకలు ఏర్పాటు చేశారు. చిన్నారుల కోసం ప్రత్యేకంగా 10 పడకలను అందుబాటులోకి తీసుకొచ్చారు. స్పర్శ్‌ హాస్పిస్‌లో డాక్టర్లు, 30 మందికి పైగా నర్సింగ్‌ సిబ్బంది సేవలు అందిస్తారు. ఏపీతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర, కర్ణాటక నుంచి రోగులు ఇక్కడికి వచ్చి చికిత్స పొందుతున్నారు. స్పర్శ్‌ హాస్పిస్‌కు నీటి, విద్యుత్‌, ఆస్తిపన్ను రద్దు చేస్తాం. ప్రభుత్వ ఆధ్వర్యంలో పాలియేటివ్‌ సేవలు అందించాలని యోచిస్తున్నాం. ’ అని కేటీఆర్‌ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో శాంతా బయోటెక్‌ వ్యవస్థాపకులు వరప్రసాద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని