
Updated : 19 Dec 2021 14:44 IST
AP News: స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
రేణిగుంట: చిత్తూరు జిల్లా రేణిగుంట మండలం జి.వి.పాలెం సమీపంలోని స్వర్ణముఖి నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. నదిలో ఈ ఉదయం నలుగురు విద్యార్థులు ఈతకు వెళ్లారు. వారిలో జి.వి.పాలెం ఎస్సీ కాలనీకి చెందిన గణేష్(15), యుగంధర్(14), ధోని(16) గల్లంతు కాగా లిఖిత్ సాయి క్షేమంగా ఒడ్డుకు చేరాడు. సమాచారం అందుకున్న రేణిగుంట పోలీసులు, రెస్క్యూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని గల్లంతైన విద్యార్థుల కోసం గాలిస్తున్నారు.
Tags :