AP News: అడ్వైజరీ కమిటీ నియామక సమాచారంతో ఉక్కు ఉద్యమం ఉద్ధృతం

ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంలో భాగంగా లీగల్‌ అడ్వైజరీ కమిటీని నియమిస్తు్న్నారన్న సమాచారంతో కార్మికులు,

Updated : 13 Sep 2023 15:14 IST

విశాఖ: ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయంలో భాగంగా లీగల్‌ అడ్వైజరీ కమిటీని నియమిస్తున్నారన్న సమాచారంతో కార్మికులు, నిర్వాసితులు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశారు. స్టీల్ ప్లాంట్ లోపలకు వెళ్లే అన్ని గేట్ల వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. విధులకు వెళ్లే కార్మికులు, ఉద్యోగులను అడ్డుకునన్నారు. అఖిలపక్ష పోరాట కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళనలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొని ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం తన నిర్ణయాన్ని ఇప్పటికైనా ఉపసంహరించుకోవాలని.. లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళతామని విశాఖ స్టీల్‌ ప్లాంట్ పరిరక్షణ పోరాట సమితి సభ్యులు తెలిపారు. వైసీపీటీసీ, టీఎన్టీయూసీ, డీఎంఎస్ సంఘాల ప్రతినిధులు నిరసనలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని