TS News: ‘పాలమూరు- రంగారెడ్డి’ మొదటి మోటార్‌ డ్రై రన్‌ విజయవంతం

 ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం మాదిరిగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరదాయిని అని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. 

Updated : 03 Sep 2023 22:13 IST

మహబూబ్‌నగర్‌: ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం మాదిరిగా.. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వరదాయిని అని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్ అన్నారు. ఈ పథకంలో భాగమైన కర్వెన జలాశయానికి 45 రోజుల్లో సాగునీటిని తీసుకొస్తామని వెల్లడించారు. తిమ్మాజీపేట సమీపంలోని పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కాలువ పనులను అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. ప్రాజెక్టులో మొదటి మోటార్‌ డ్రై రన్‌ ప్రారంభించారు. అనంతరం ప్రాజెక్ట్‌ పనులపై నీటిపారుదల శాఖ, రెవెన్యూ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా రజత్‌ కుమార్‌ మాట్లాడారు.

ప్రాజెక్టులో 4 మోటార్‌లను అమర్చామని, అందులో నార్లపూర్‌ రిజర్వాయర్‌లో నిర్వహించిన మొదటి మోటార్‌ డ్రై రన్‌ను విజయవంతంగా పరీక్షించినట్లు తెలిపారు. మరో 15 రోజుల్లో ఒక పంపు ద్వారా నీళ్లను ఎత్తిపోసే ప్రక్రియ ప్రారంభిస్తామన్నారు. ఒక మోటార్ 3 వేల క్యూసెక్కుల నీటిని ఎత్తిపోస్తుందని.. నిబంధనల ప్రకారం ముందుగా నార్లాపూర్ రిజర్వాయర్‌ను నింపుతామని తెలిపారు. ఆ తర్వాత 45 రోజుల్లో ఎదుల, వట్టెం, కర్వెన రిజర్వాయర్‌ల వరకు ఆ నీళ్లు తీసుకొస్తామన్నారు. పర్యావరణ అనుమతులతో పాటు అన్ని అనుమతులు వచ్చాక.. గత 3 వారాలుగా ఇంజినీర్లు, సిబ్బంది 24 గంటలు పనిచేస్తున్నారని వివరించారు. చిన్నచిన్న సమస్యలు, పనులు మిగిలి ఉన్నాయని.. మిషన్ భగీరథకు సంబంధించి వట్టెం వద్ద పైపు మార్చే పనులతో పాటు కుడికిళ్ల వద్ద డీప్ కట్ సమస్యను సైతం పరిష్కరిస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని