Updated : 28 Jun 2021 13:14 IST

Top Ten News @ 1 PM

1. AP News: భగ్గుమన్న విద్యార్థి సంఘాలు

ఇటీవల ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌పై రాష్ట్రంలోని పలు విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో విద్యార్థి, యువజన సంఘాల నేతలు నిరసన చేపట్టారు. మంత్రులు, ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడికి యత్నించారు. ఇటీవల ప్రభుత్వం విడుదల చేసిన జాబ్‌ క్యాలెండర్‌లో నామమాత్రంగా ఖాళీ పోస్టులను చూపించారని ఆరోపించారు. వేల సంఖ్యలో ఉన్న ఖాళీలతో కొత్త జాబ్‌ క్యాలెండర్‌ను విడుదల చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. WTC Final: పుజారాను నిందిస్తూ ముందుకెళ్తారా?

టీమ్‌ఇండియా నయావాల్‌ చెతేశ్వర్‌ పుజారాకు దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అండగా నిలిచారు. ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఓటమికి అతడిని నిందిస్తే ఏం చేయలేమని తెలిపారు. న్యూజిలాండ్‌ క్రికెటర్లు సైతం నెమ్మదిగానే ఆడారని గుర్తు చేశారు. సారథి విరాట్‌ కోహ్లీని ఉద్దేశించే ఆయన పరోక్షంగా ఈ వ్యాఖ్యలు చేశారని తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Shikhar dhawan: ఇదో కొత్త సవాలు 

3. పీవీ విగ్రహాన్ని ఆవిష్కరించిన గవర్నర్‌, కేసీఆర్‌

 మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శత జయంతి ముగింపు ఉత్సవాలను నగరంలోని పీవీ మార్గ్‌లో ఉన్న జ్ఞానభూమిలో నిర్వహించారు. ఇందులో భాగంగా గవర్నర్‌ తమిళిసై, సీఎం కేసీఆర్‌ నెక్లెస్‌రోడ్డులోని 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం వారు ఆయన విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పీవీ మార్గ్‌ను ప్రారంభించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. MWC 2021 : టెక్‌ పండగ వస్తోంది.. ఏం తెస్తుందో?

కొత్త కొత్త మొబైళ్లు, గ్యాడ్జెట్ల, సాంకేతికతను ప్రపంచానికి పరిచయం చేయడానికి ఏటా మొబైల్‌ వరల్డ్‌ కాంగ్రెస్‌ (MWC) నిర్వహిస్తుంటారు. కరోనా పరిస్థితుల వల్ల గతేడాది ఈ మొబైళ్ల పండగ జరగలేదు. ఈ ఏడాది వర్చువల్‌లో నిర్వహిస్తున్నారు. భారత కాలమానం ప్రకారం సోమవారం (జూన్‌ 28) మధ్యాహ్నం నుంచి జులై 1 వరకు స్పెయిన్‌లోని బార్సిలోనాలో జరుగుతుంది. అక్కడ ఈ ఏడాది పరిచయం చేయబోయే అంశాల గురించి మీరూ చదివేయండి! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

E-comm:ఆ సంస్థలు అహంకారంతో చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాయి

5. Modi: మంత్రివర్గంలో మరో 27 మంది?

మంత్రివర్గ విస్తరణపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కసరత్తును ముమ్మరం చేశారు. కేంద్ర మంత్రుల పనితీరును మదింపు వేసిన ఆయన మంత్రిమండలిలో భారీగా మార్పులు, చేర్పులు చేయవచ్చని భాజపా వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే 27 మంది నేతల పేర్లను పరిశీలించినట్టు తెలుస్తోంది. జమ్మూ-కశ్మీర్‌ అంశంపై అఖిల పక్ష సమావేశం నిర్వహించిన ప్రధాని మళ్లీ మంత్రివర్గం కూర్పుపై దృష్టి సారించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం... పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పెళ్లికి నిరాకరించిందని గంజాయి కేసు కుట్ర

తనతో పెళ్లికి ఆమె నిరాకరించిందనే అక్కసుతో గంజాయి కేసులో ఇరికించేందుకు కుట్ర పన్నాడు ఓ వ్యక్తి. మాదకద్రవ్యాల అక్రమ నిల్వల కేసులో చివరకు అరెస్ట్‌ కూడా చేయించాడు. ఈ కేసు నుంచి బయటపడేందుకు ఆ యువతి పెద్ద యుద్ధమే చేయాల్సి వచ్చింది. కేరళలోని తిరువనంతపురంలో ఈ సంఘటన జరిగింది. రాష్ట్రంలోని ప్రముఖ మహిళా వ్యాపారవేత్త శోభా విశ్వనాథ్‌కు తిరువనంతపురంలోని లార్డ్స్‌ ఆసుపత్రి సీఈవో హరీశ్‌ హరిదాస్‌తో పరిచయం ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Mango: 12 మామిడిపండ్లు రూ.1.2 లక్షలు 

7. ₹14,500 తో సిప్‌..35 సంవ‌త్స‌రాల్లో ₹23 కోట్లు

తెలివైన పెట్టుబ‌డుదారుడు ఎవ‌రంటే త‌మ‌కు అందుబాటులో ఉన్న పెట్టుబ‌డి ఆప్ష‌న్‌తో త‌మ‌కు వీలైనంత, దీర్ఘ‌కాలం కొర‌కు నెల‌వారిగా కొంత సిప్ రూపంలో పెట్టుబ‌డి పెట్టి మంచి లాభాల‌ను పొందేవాడు. దీనికోసం ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబ‌డి అవ‌స‌రం లేదు. నెల‌కు వీలైనంతో మొత్తంతో సిప్ చేస్తూ మొత్తం దీర్ఘ‌కాలంలో మీర ఊహించ‌నిదానికంటే మంచి రాబ‌డి పొంద‌వ‌చ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ త‌ర్వాత జీవ‌నం కోసం లేదా పిల్ల‌ల చ‌దువులు, అవ‌స‌రాల కోసం ఎటువంటి దిగులు ఉండ‌దు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. JK: పోలీసు అధికారిని చంపిన ఉగ్రవాదులు

కశ్మీర్‌లో ఉగ్రవాదులు మరోసారి ఘాతుకానికి తెగబడ్డారు. జమ్మూకశ్మీర్‌ మాజీ ప్రత్యేక పోలీసు అధికారి(ఎస్‌పీఓ) ఫయాజ్‌ అహ్మద్‌ సహా ఆయన కుటుంబంపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఫయాజ్‌తో పాటు ఆయన భార్య కూడా ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. పుల్వామా జిల్లాలోని అవంతిపొరాలో ఉన్న ఫయాజ్‌ నివాసంలోకి ఉగ్రవాదులు ఆదివారం చొరబడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం

9. Corona: వెయ్యి దిగువకు మరణాలు

 దేశంలో కరోనా వ్యాప్తి తగ్గుముఖం పడుతోంది. తాజాగా 46,148 మందికి వైరస్‌ సోకినట్లు తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.7 శాతం తగ్గుదల కనిపించింది. నిన్న మరో 979 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు రెండున్నర నెలల తర్వాత తొలిసారి వెయ్యిలోపు మరణాలు నమోదయ్యాయి. ప్రస్తుతం మొత్తం కేసులు 3,02,79,331 చేరగా..3,96,730 మంది ప్రాణాలు కోల్పోయారని సోమవారం కేంద్ర ఆరోగ్య శాఖ విడుదల చేసిన గణాంకాలు చెబుతున్నాయి. అలాగే నిన్న 15,70,515 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. MAA Election: సీవీఎల్‌కు రాములమ్మ సపోర్ట్

సినిమా షూటింగులతో సందడిగా ఉండే టాలీవుడ్‌లో మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ‘మా’ ఎన్నికల కారణంగా వాతావరణం వేడెక్కింది. ‘మా’లో ఇకపై తెలంగాణ, ఆంధ్రా అని రెండు విభాగాలు ఉండాలంటూ నటుడు సీవీఎల్‌ నరసింహారావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. కాగా, తాజాగా సీవీఎల్‌ చేసిన వ్యాఖ్యలకు ప్రముఖ నటి విజయశాంతి మద్దతు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

OTT:ఓ చూపు... ఓటీటీ వైపు!

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని