Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 17 Aug 2021 20:54 IST

1. Afghanistan: అఫ్గాన్‌ గగనతలం మూసివేత.. విమానాలు వెళ్లలేని పరిస్థితి

తాలిబన్ల అధీనంలో ఉన్న అఫ్గానిస్థాన్‌ నుంచి బయటపడేందుకు వేలాది మంది ప్రజలు కాబుల్‌ విమానాశ్రయానికి పోటెత్తారు. అటు భారత్‌, అమెరికా సహా పలు దేశాలు తమ పౌరులను వెనక్కి రప్పించేందుకు ప్రత్యేక విమానాలు నడుపుతున్నాయి. దీంతో కాబుల్‌ ఎయిర్‌పోర్ట్‌ కిక్కిరిసిపోయింది. అయితే ప్రస్తుతం ఆ దేశ గగనతలాన్ని మూసివేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో కాబుల్‌కు విమానాలు వెళ్లలేని పరిస్థితి తలెత్తింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Kabul Airport: అఫ్గాన్ల ప్రాణ భయానికి నిదర్శనం కాబుల్‌ ఎయిర్‌పోర్టు

2. AP News: రమ్య మృతదేహం తరలించకుండా అడ్డగింత

నడిరోడ్డుపై ఆదివారం దారుణ హత్యకు గురైన బీటెక్‌ విద్యార్థిని రమ్య మృతదేహానికి గుంటూరు జీజీహెచ్‌లో శవపరీక్ష పూర్తయింది. దీంతో రమ్య మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు కుటుంబసభ్యులు యత్నించారు. అయితే జీజీహెచ్‌ వద్దకు వివిధ పార్టీల నేతలు, ప్రజాసంఘాల ప్రతినిధులు చేరుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలో రమ్య మృతదేహాన్ని జీజీహెచ్‌ నుంచి తరలించకుండా విపక్షాలు, ప్రజాసంఘాల ప్రతినిధులు అడ్డుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. Afghanistan: ‘ఘనీ బాబా పారిపోయారు.. ఆ దేశద్రోహికి శిక్ష తప్పదు’

అమెరికా బలగాల ఉపసంహరణతో అఫ్గానిస్థాన్‌లో రెచ్చిపోయిన తాలిబన్లు ఎట్టకేలకు దేశాన్ని తమ వశం చేసుకున్నారు. దీంతో అధ్యక్షుడు అష్రాఫ్‌ ఘనీ పలాయనం చిత్తగించారు. దీంతో యుద్ధం ముగిసిందని తాలిబన్లు ప్రకటించుకున్నారు. ఈ పరిణామాల అనంతరం కొద్ది గంటల తర్వాత భారత్‌లోని అఫ్గాన్‌ ఎంబసీ అధికారిక ట్విటర్‌ ఖాతా నుంచి ఓ అనుచిత ట్వీట్‌ వచ్చింది. అందులో అష్రాఫ్‌పై ఘాటు విమర్శలు ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Afghanistan Crisis: రక్తపాతాన్ని నివారించడానికే దేశాన్ని వీడాను: అష్రాఫ్‌ ఘనీ

4. Schools Reopen: ఏపీలో తెరుచుకున్న విద్యాసంస్థలు

కరోనా సెకెండ్‌ వేవ్‌తో ఆంధ్రప్రదేశ్‌లో గత ఏప్రిల్‌ 20న మూతపడిన విద్యాసంస్థలు ఈరోజు నుంచి పునః ప్రారంభమయ్యాయి. విద్యార్థుల రాకతో రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల వద్ద సందడి నెలకొంది. పాఠశాలలతో పాటు జూనియర్‌ కళాశాలలు కూడా తెరుచుకున్నాయి. కరోనా నిబంధనలు కచ్చితంగా పాటిస్తూ 1 నుంచి 10 తరగతులు, ఇంటర్‌ రెండో ఏడాది వారికి తరగతులు నిర్వహించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. PM Modi - PV Sindhu: బల్లెంవీరుడికి చుర్మా.. సింధుకు ఐస్‌క్రీం.. తినిపించిన మోదీ!

ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన, ప్రతిభ కనబరిచిన క్రీడాకారులతో ప్రధాని నరేంద్రమోదీ సమావేశం అయ్యారు. వారితో ఆత్మీయంగా మాట్లాడారు. అనుకున్నట్లుగానే ఆయన పీవీ సింధుకు ఐస్‌క్రీం తినిపించారు. స్వర్ణ పతక విజేత నీరజ్‌ చోప్రాకు చుర్మా తినిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Team India: పర్లేదు..! భారత బ్యాట్స్‌మెన్‌ పరుగుల వరద పారిస్తారు చూస్తుండడి!

6. SBI Rakshabandhan Offer: ఎస్‌బీఐ రక్షాబంధన్‌ డిస్కౌంట్లు!

దేశవ్యాప్తంగా పండగ వాతావరణం ప్రారంభమైంది. దీంతో డిజిటల్‌ చెల్లింపులను ప్రోత్సహించేందుకు బ్యాంకులు సమాయత్తమవుతున్నాయి. దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ.. రాఖీ పండుగ సందర్భంగా ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. ‘ఫెర్న్స్‌ అండ్‌ పెటల్స్‌’లో బహుమతులు కొనుగోలు చేసేవారు ఎస్‌బీఐ యోనో యాప్‌ ద్వారా చెల్లింపులు చేస్తే 20 శాతం కచ్చితమైన రాయితీ లభించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. Tollywood: ఈ వారం థియేటర్‌/ ఓటీటీలో వచ్చే సినిమాలివే!

స్వాతంత్ర్యదినోత్సవాన్ని పురస్కరించుకుని అటు థియేటర్‌లలోనూ, ఇటు ఓటీటీల్లో పలు సినిమాలు సందడి చేశాయి. అదే ఉత్సాహంతో ఈ వారం కూడా మరికొన్ని చిత్రాలు అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. అయితే, ఈసారి ఎక్కువ సినిమాలు థియేటర్‌లో విడుదలవుతుండటం గమనార్హం. మరి అటు థియేటర్‌లలో, ఇటు ఓటీటీల్లో సందడి చేయబోయే సినిమాలేంటో చూసేద్దామా! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Manchi Rojulu Vachayi: సో సోగా ఉన్న నన్నే సో స్పెషలే చేశావులే

8. Rajya Sabha: రాజ్యసభ వివాదంలో ఎంపీలపై చర్యలు తప్పవా?

రాజ్యసభలో నిబంధనలను ఉల్లంఘించి అతిగా ప్రవర్తించిన ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకోవాలని ఏడుగురు కేంద్ర మంత్రులు ఛైర్మన్‌ వెంకయ్యనాయుడికి మరోసారి విజ్ఞప్తి చేశారు. ఆగస్టు 11న సభలో కనిపించినట్టుగా ప్రతిపక్ష సభ్యుల హింసాత్మక కార్యకలాపాలు ఇదివరకెన్నడూ చూడలేదని, బాధ్యులపై  చర్యలు తీసుకోవాలని ఆదివారం ఉప రాష్ట్రపతికి మంత్రులు వినతిపత్రం సమర్పించారు. మార్షల్స్‌ను వారి విధులు నిర్వహించకుండా సభ్యులు అడ్డుకున్నారని కూడా ఫిర్యాదు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. Viveka Murder Case: ముగిసిన సునీల్‌ యాదవ్‌ సీబీఐ కస్టడీ

 మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు సునీల్‌ యాదవ్‌కు సీబీఐ కస్టడీ ముగిసింది. 10రోజుల పాటు సీబీఐ అధికారులు అతడిని విచారించారు. కస్టడీ ముగియడంతో కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. మధ్యాహ్నం లోపు పులివెందుల కోర్టులో సునీల్‌ యాదవ్‌ను హాజరుపరచనున్నారు. మరోవైపు ఈ కేసులో సీబీఐ 71వ రోజు విచారణ కొనసాగుతోంది. పులివెందుల ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో పలువురు అనుమానితులను సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

TS News: అమ్మకు బాగోలేదు.. అమ్మేస్తున్నాం

10. India Corona: తగ్గిన కొత్త కేసులు.. మరణాలు

దేశంలో హెచ్చుతగ్గులతో కరోనా వ్యాప్తి కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో నమోదైన కొత్త కేసులు, మరణాల్లో తగ్గుదల కనిపించింది. కేసులు 32 వేలకు తగ్గగా.. మరణాలు 400 మార్కుకు చేరువయ్యాయి. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాలను వెల్లడించింది. తాజాగా 11,81,212 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 32,937 మందికి పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే కేసులు 8.7శాతం మేర తగ్గాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని