Top Ten News @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 23 Jun 2021 09:15 IST

1. జంట యాంటీబాడీలతో కొత్త వేరియంట్లకు చెక్‌

కరోనా కొత్త వేరియంట్లను యాంటీబాడీ కాక్‌టెయిల్‌తో కట్టడి చేయవచ్చని అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. రెండు భిన్నరకాల యాంటీబాడీలతో కూడిన ఈ మిశ్రమం.. సమర్థంగా పనిచేస్తున్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది. మానవ రోగనిరోధక వ్యవస్థ యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కొన్నిసార్లు ఆలస్యమవుతుంది. దీన్ని అధిగమించడానికి కృత్రిమంగా రూపొందిన మోనోక్లోనల్‌ యాంటీబాడీలను రోగులకు ఇస్తున్నారు. అమెరికాలోని వాషింగ్టన్‌ యూనివర్సిటీ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ పరిశోధకులు.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Coffee: కాఫీతో కాలేయ వ్యాధులు దూరం!

2. జగన్‌ అవినీతిని సాక్ష్యాలతో నిరూపిస్తాం

ఏపీలో సంక్షేమం పేరుతో మోసం జరుగుతోందని తెదేపా అధ్యక్షుడు చంద్రబాబు ఆరోపించారు. గోరంత ఇస్తూ కొండంత దోచేస్తూ సాగిన రెండేళ్ల పాలనలో సీఎం జగన్‌ హోల్‌సేల్‌గా అవినీతికి పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఆయన అవినీతిని సాక్ష్యాలతో సహా నిరూపిస్తామని చెప్పారు. జగన్‌ తప్పుడు విధానాలను ప్రజల్లో ఎండగట్టేందుకు తెదేపా క్షేత్ర స్థాయి పోరాటాలకు సిద్ధమవుతోందని ప్రకటించారు. పార్టీ ముఖ్య నేతలు, నియోజకవర్గ ఇన్‌ఛార్జులతో ఆయన మంగళవారం ఆన్‌లైన్‌లో సమావేశమయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* జగన్‌ మీద కేసుల ఉపసంహరణపై నేడు హైకోర్టు సుమోటో విచారణ

3. మరో మహా అంతర్ధానం మనిషితోనే!

జీవుల అంతర్ధానం అనగానే డైనోసార్లు కనుమరుగవటమే గుర్తుకొస్తుంది. భూమిని ఢీకొట్టిన  గ్రహ శకల ప్రభావంతో అంత పెద్ద డైనోసార్లు పూర్తిగా అదృశ్యమైపోయాయి మరి. మనకు కాస్త సమీప కాలంలో జరిగింది కావటం, తరచూ దీని గురించి ప్రస్తావిస్తుండటంతో ఇదే మన మనసులో మెదులుతుంటుంది. నిజానికి దీనికన్నా ముందే నాలుగు సార్లు జీవులు పెద్ద ఎత్తున అంతర్ధానమయ్యాయి. ఇప్పుడు మనం ఆరో మహా అంతర్ధాన ప్రక్రియలోనే జీవిస్తున్నాం. దీనికి మనిషి ప్రోద్బలమే కారణమవుతుండటం విషాదం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వుహాన్‌ ల్యాబ్‌కు నోబెల్‌ ఇవ్వండి మరి..

కరోనా వైరస్‌ వుహాన్‌ ప్రయోగశాల నుంచే లీకైందా అనే విషయంపై అగ్రరాజ్యం అమెరికా ఓవైపు దర్యాప్తు చేస్తుంటే.. మరోవైపు చైనా మాత్రం ఆ ల్యాబ్‌కు నోబెల్‌ బహుమతి ఇవ్వాలంటోంది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఝావ్‌ లిజియాన్‌ మీడియా సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. వుహాన్‌ ల్యాబ్‌లోనే వైరస్‌ పుట్టి ఉంటుందని సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిపై ఆయన ధ్వజమెత్తారు. వుహాన్‌ ల్యాబ్‌ నుంచి పొరపాటున ఈ వైరస్‌ బయటకు వచ్చిందనడం ఊహాజనిత కథనమని కొట్టిపారేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* hawking: హాకింగ్‌ సిద్ధాంతం గెలిచింది

5. ప్రాణాలనుపణంగా పెట్టి పాఠశాలలు తెరవొద్దు!

 కొవిడ్‌ పరిస్థితులను క్షుణ్ణంగా అంచనా వేయకుండా పాఠశాలలు తెరవడం మంచిది కాదని నీతి ఆయోగ్‌ సభ్యుడు వీకే పాల్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో అత్యంత అప్రమత్తత అవసరమని, ప్రాణాలను పణంగా పెట్టి దీనిపై నిర్ణయం తీసుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. దిల్లీలో ఆయన మంగళవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. ‘‘పాఠశాల అంటే టీచర్‌, హెల్పర్‌, విద్యార్థులు ఉంటారు. అందరూ ఒకేచోట కూర్చోవాల్సి ఉంటుంది. దీంతో వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇచ్చినట్లవుతుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* వచ్చే నెలలో డిగ్రీ, ఇంజినీరింగ్‌ పరీక్షలు

6. అంత బలవంతుడివా... అదీ చూస్తాం

అనుమతుల్లేకుండా నిర్మాణం చేపట్టిన ఓ వ్యక్తి వ్యవహారశైలిపై హైకోర్టు మండిపడింది. మంగళవారం ఈ అప్పీలును విచారిస్తున్న క్రమంలో గతంలో సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వుల్లోని వివరాలను ఉటంకిస్తూ అతడిపై ఆగ్రహం వ్యక్తంచేసింది. అధికార పార్టీ అండ చూసుకుని పిటిషనర్‌ వాస్తవాలను తొక్కిపెట్టారని, అధికారులను బెదిరించారని, న్యాయవాదిపై భౌతికదాడులకు పాల్పడ్డారని సింగిల్‌ జడ్జి తన ఉత్తర్వుల్లో పేర్కొనడాన్ని ప్రస్తావిస్తూ ‘‘ఎంత బలవంతుడివో తామూ చూస్తామని, ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తామని’’ పిటిషనర్‌ను ఉద్దేశించి పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మంచుకొండల్లో రాజకీయ వేడి!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో జమ్మూకశ్మీర్‌ రాజకీయ నాయకుల భేటీకి ఎట్టకేలకు ముహూర్తం కుదిరింది. రేపు జరగబోయే ఈ సమావేశానికి  సంబంధించి ఇప్పటికే కేంద్ర హోం శాఖ నుంచి ఆయా నేతలకు ఆహ్వానాలు వెళ్ళాయి. రెండేళ్ల క్రితం 370వ అధికరణ రద్దుతో తన ప్రత్యేక ప్రతిపత్తిని కోల్పోయిన ప్రాంతంలో దీనితో ఎన్నికల రాజకీయాలు మళ్ళీ మొదలుకాబోతున్నాయి. 370వ అధికరణ రద్దును నిరసిస్తూ ‘పీపుల్స్‌ అలయెన్స్‌ ఫర్‌ గుప్కార్‌ డిక్లరేషన్‌’(పీఏజీడీ) పేరిట స్థానిక ప్రముఖ రాజకీయ పక్షాలన్నీ కూటమి కట్టిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* కొత్త కలయిక!

8. డ్రానా.. డ్రామానా!

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ రిజర్వ్‌ డే (ఆరో రోజు)లోకి అడుగుపెట్టింది. వర్షంతో చాలా ఆటే వృథా అయినా మ్యాచ్‌పై ఇంకా ఆసక్తి లేకపోలేదు. డ్రా అవకాశాలే మెండు అయినా.. ఇప్పుడున్న పరిస్థితుల రీత్యా ఫలితం తేలే అవకాశాలను పూర్తిగా కొట్టిపారేయలేం. భారత్‌ విలువైన 32 పరుగుల ఆధిక్యం కోల్పోయి, ప్రస్తుతం 64/2 తో ఉంది. చేతిలో ఇంకా 8 వికెట్లే ఉన్నప్పటికీ ముప్పు లేదని చెప్పలేం. కఠిన పరిస్థితుల్లో.. కివీస్‌ పదునైన పేస్‌ దళాన్ని కాచుకుని.. కోహ్లీసేన కుప్పకూలకుండా తనను తాను కాపాడుకోవాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అమ్మాయిగా మొదలై.. అమ్మగా!

9. అంతరిక్షంలోకి.. టిక్‌టాకర్‌

అంతరిక్షం అనగానే వ్యోమగాములు గుర్తొస్తారు. సామాన్యులకు వాళ్లని చూడటమే ఒక అబ్బురం. కానీ.. కెల్లీ గెరార్డి అనే టిక్‌టాకర్‌కు ఏకంగా స్పేస్‌షిప్‌లో ప్రయాణించే అవకాశమొచ్చింది. అదెలా సాధ్యమైందంటే..!! వర్జిన్‌ గెలాక్టిక్‌ స్పేస్‌ టూరిజం సంస్థ. వచ్చే ఏడాది నుంచి మనుషుల అంతరిక్ష పర్యాటకానికి కృషి చేస్తోంది. ఈ దిశగా పరిశోధనలు చేయనున్నారు. అందుకే కెల్లీ గెరార్డిని ఎంపిక చేశారు. ఈమె ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఆస్ట్రోనాటికల్‌ సైన్సెస్‌ (ఐఐఏఎస్‌)లో పరిశోధకురాలు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. AP News: అసాంఘిక శక్తులకు అడ్డాలు

కృష్ణా, గుంటూరు జిల్లాల మధ్య నుంచి ప్రవహించే కృష్ణా నదిలోని ఇసుక తిన్నెలు అరాచక శక్తులకు నెలవుగా మారాయి. నదికి రెండు వైపులా ఉన్న ఘాట్లు పోకిరీలకు అడ్డాలుగా మారాయి. ఐదేళ్ల క్రితం కృష్ణా పుష్కరాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఘాట్లను భారీగా విస్తరించారు. వీటిని బ్లేడు బ్యాచ్‌, గంజాయి ముఠా, తాగుబోతులు, అసాంఘిక శక్తులు తమ కార్యకలాపాలకు వినియోగించుకుంటున్నారు. ప్రశాంతత కోసం అటు తాడేపల్లిలో, ఇటు విజయవాడలోని ఘాట్లకు సాయంత్రం పూట వచ్చే వారిని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Ap News: అత్యాచారం కేసు... అదుపులో ఇద్దరు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని