Updated : 25 Jun 2021 09:10 IST

Top Ten News @ 9 AM

1. ముగిసిన 30 ఏళ్ల విప్లవ ప్రస్థానం

మావోయిస్టు పార్టీ ఓ కీలకనేతను కోల్పోయింది. గెరిల్లా యుద్ధతంత్రంలో ఆరితేరిన ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యుడు యాప నారాయణ (50) అలియాస్‌ హరిభూషణ్‌ అలియాస్‌ జగన్‌ సోమవారం మరణించినట్లు ఆ పార్టీ గురువారం ప్రకటించింది. దీంతో మూడు రోజుల సందిగ్థతకు తెరపడింది. మరో కీలక నాయకురాలు ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు సిద్దిబోయిన సారక్క అలియాస్‌ భారతక్క కరోనా లక్షణాలతో మంగళవారం చనిపోయినట్లు పార్టీ పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Seethakka: కన్నీరు పెట్టుకున్న సీతక్క

2. మూడో దశలో.. గర్భిణులూ జర జాగ్రత్త!

రోనా మూడో దశ వచ్చే పక్షంలో గర్భిణులపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉందని హైదరాబాద్‌ రెయిన్‌బో చిన్నపిల్లల ఆసుపత్రి ఛైర్మన్‌, ఎండీ, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్‌ రమేష్‌ కంచర్ల తెలిపారు. రెండో దశలో కొవిడ్‌ బారిన పడిన గర్భిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. పెద్దల్లో బ్లాక్‌ ఫంగస్‌ వ్యాధి వచ్చినట్లే చిన్నారులను మల్టీసిస్టం ఇన్‌ఫ్లమేటరీ సిండ్రోమ్‌(ఎంఐఎస్‌-సి) ఇబ్బందిపెట్టే ప్రమాదం ఉందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. క్రికెట్‌ మహర్షి

ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ (డబ్ల్యూటీసీ) ఫైనల్‌.. టేలర్‌ ఫోర్‌తో కివీస్‌ విజయాన్ని అందుకోగానే స్టాండ్స్‌లోని ఆ దేశ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. డ్రెస్సింగ్‌ గదిలోని ఆ జట్టు ఆటగాళ్లు సంతోషంతో గంతులేశారు. కానీ మరో ఎండ్‌లో ఉన్న విలియమ్సన్‌.. గాల్లోకి ఎగిరి విజయనాదం చేయలేదు.. ప్రత్యర్థి వైపు చూస్తూ గెలుపు సంబరాలు చేసుకోలేదు.. ‘‘మేం గెలిచాం’’ అన్నట్లు ఓ నవ్వు విసిరేశాడంతే. ఎందుకంటే జెంటిల్మన్‌ ఆటైన క్రికెట్లో అతనో నిఖార్సైన జెంటిల్మన్‌. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

మరమ్మతులు తప్పవు

4. మైక్రోసాఫ్ట్‌ నుంచి మరో సాంకేతిక అద్భుతం

దిగ్గజ సాఫ్ట్‌వేర్‌ సంస్థ మైక్రోసాఫ్ట్‌ తన విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టం(ఓఎస్‌) శ్రేణిలో తదుపరి ఆవిష్కరణను తీసుకొచ్చింది. వినియోగదారులను ఆకర్షించే సరికొత్త సదుపాయాలతో విండోస్‌ 11 ఓఎస్‌ను గురువారం వర్చువల్‌ విధానంలో ఆవిష్కరించింది. 2015లో విండోస్‌ 10ను విడుదల చేసిన తరువాత మైక్రోసాఫ్ట్‌ నుంచి వచ్చిన కీలక ఆవిష్కరణ ఇదే. ‘‘వచ్చే పదేళ్ల వరకూ వినియోగదారుల అవసరాలను తీర్చేలా దీన్ని రూపొందిస్తున్నాం. విండోస్‌ చరిత్రలో ఇదో పెద్ద మైలు రాయి’’ అని మైక్రోసాఫ్ట్‌ సీఈవో సత్య నాదెళ్ల ఈ సందర్భంగా పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైద్యంలో పదివేల కొలువులు

 కొత్తగా ఏర్పాటు చేసిన ఏడు వైద్య కళాశాలలు, 15 నర్సింగ్‌ కాలేజీల్లో 10 వేలకు పైగా కొలువులు రానున్నాయి. రెగ్యులర్‌ ప్రాతిపదికన 7,727 మందిని నియమిస్తారు. ఈ మేరకు పోస్టులను మంజూరు చేస్తూ రాష్ట్ర ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి కె.రామకృష్ణారావు గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉద్యోగాల భర్తీకి ముందు వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ, ఆర్థిక శాఖల అనుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. మంజూరు చేసిన పోస్టులకు డైరెక్ట్‌ రిక్రూట్‌మెంట్‌ సర్వీసు నిబంధనలు వర్తిస్తాయని వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. Deltavirus: భౌగోళిక ముప్పుగా డెల్టా వేరియంట్‌!

వేగంగా వ్యాపించే స్వభావమున్న డెల్టా వేరియంట్‌ కరోనా వైరస్‌ ఇప్పటివరకు 85 దేశాలకు ప్రబలిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. 11 దేశాల్లో గత రెండు వారాల్లోనే డెల్టాను గుర్తించినట్టు పేర్కొంది. ఇదే పోకడ కొనసాగితే ఈ వేరియంట్‌ మొత్తం ప్రపంచానికి ముప్పుగా పరిణమిస్తుందని ఈ నెల 22న విడుదల చేసిన నివేదికలో పేర్కొంది. డెల్టా కంటే ముందు వేగంగా ప్రబలిన ఆల్ఫా, బీటా, గామా వేరియంట్లను కూడా ‘ఆందోళనకర వేరియంట్లు’గా డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Corona: ఫోన్‌ స్వాబ్‌తో కొవిడ్‌ నిర్ధారణ!

7. VISA: తిరస్కరణకు గురైనా మళ్లీ దరఖాస్తు..

హెచ్‌-1బి వీసా ఆశావహులకు అమెరికా పౌరసత్వం, ఇమ్మిగ్రేషన్‌ సేవల (యూఎస్‌సీఐఎస్‌) సంస్థ శుభవార్త చెప్పింది! 2021 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వీసా దరఖాస్తు ఇప్పటికే తిరస్కరణకు గురైనప్పటికీ.. మళ్లీ దరఖాస్తు చేసుకునే వెసులుబాటును కొంతమంది విదేశీ ఉద్యోగ నిపుణులకు కల్పించనున్నట్లు ప్రకటించింది. ముందుగానే వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. 2020 అక్టోబరు 1 తర్వాత వీసా ప్రారంభ తేదీని పరిగణించాలని విన్నవించిన పలువురి దరఖాస్తులను తాము తిరస్కరించిన సంగతిని యూఎస్‌సీఐఎస్‌ గుర్తుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. డబ్బు దానంతట అదే వస్తుందన్నారు!

బురఖా లేనిదే బయటికి రాకూడదన్న కఠిన నిబంధనలుండే కుటుంబంలో పుట్టిందా అమ్మాయి. పైగా ఎప్పుడూ అవే దుస్తులు. ఈ పద్ధతిని మార్చాలనుకుంది. చిన్న వయసులోనే సొంత ఫ్యాషన్‌ బ్రాండ్‌తో ఆకట్టుకుంది. అంతటితో ఆగలేదు... ప్రతి రంగంలోనూ తన ముద్ర వేయాలని తపించింది. 34 ఏళ్లొచ్చేసరికి అంతర్జాతీయ వ్యాపారవేత్తగా ఎదిగింది. ఆమే సారా అల్‌ మదానీ.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* Jiivi Review: జీవి రివ్యూ

9. జల్సాల కోసం ఆరుగురి హత్య

 ప్రయోజకులు కావాల్సిన వయసులో అయిదుగురు యువకులు కరుడుగట్టిన నేరస్థుల్లా మారారు. జల్సాల కోసం తొమ్మిది నెలల్లో ఆరుగురిని పాశవికంగా చంపారు. హత్యల ఆనవాళ్లు దొరకకుండా జాగ్రత్త పడ్డారు. పైగా తాము చంపిన వారి అంత్యక్రియల్లోనూ పాల్గొన్నారు. మరో 12 మందిని అంతమొందించేందుకు సిద్ధమయ్యారు. ఇంతలో పోలీసులకు చిక్కారు. వీరి అరాచకాలను గురువారం విజయవాడ నగర పోలీసు కమిషనర్‌ బత్తిన శ్రీనివాసులు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. నెలకు రూ.30వేలు రావాలంటే...

రెండేళ్ల తర్వాత మీ పెట్టుబడిపై నెలకు కనీసం రూ.30వేలు రావాలంటే.. 6 శాతం రాబడి అంచనాతో రూ.60లక్షల నిధి ఉండాలి. అదే 7శాతం రాబడి వస్తే.. రూ.52లక్షలు అవసరం. 8శాతం రాబడి వచ్చేలా మదుపు చేస్తే రూ.45 లక్షలు సరిపోతాయి. పదవీ విరమణ తర్వాత నష్టభయం లేని పథకాలను ఎంచుకుంటే.. 6 శాతం వరకే రాబడి వచ్చే వీలుంది. అధిక రాబడి రావాలంటే.. మొత్తం పెట్టుబడిలో 75శాతం వరకూ సురక్షిత పథకాల్లోనూ.. 25 శాతం దాకా ఈక్విటీ ఆధారిత పథకాలకూ కేటాయించాలి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నగదు రహితం.. సురక్షితంగా...

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని